1. జ్యూస్ & షేక్ షాప్
వేసవి వచ్చిందంటే చల్లని డ్రింక్స్ డిమాండ్ భారీగా పెరుగుతుంది. జ్యూస్, షేక్, లస్సీ, కొబ్బరి నీళ్ళు వంటి పానీయాలకు విపరీతమైన ఆదరణ ఉంటుంది.
- పెట్టుబడి: ₹10,000 – ₹50,000
- లాభం: నెలకు ₹50,000 – ₹1 లక్ష వరకు.
చిన్నపాటి స్టాల్ పెట్టుకోవచ్చు లేదా మొబైల్ వ్యాన్ ద్వారా కూడా విక్రయించొచ్చు. వ్యాపారం బాగా నడిస్తే, స్వంత బ్రాండ్ క్రియేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
2. ఐస్‌క్రీం పార్లర్
చల్లని ఐస్‌క్రీం కోసం వేసవిలో డిమాండ్ అమాంతం పెరుగుతుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఐస్‌క్రీం ప్రియులే.
Related News
- పెట్టుబడి: ₹20,000 – ₹1 లక్ష
- లాభం: రోజుకు ₹3,000 – ₹10,000 వరకు.
మీరు చిన్న షాప్ పెట్టుకోవచ్చు లేదా హోమ్ బేస్డ్ బిజినెస్‌గా కూడా స్టార్ట్ చేయొచ్చు. నేచురల్ ఐస్‌క్రీమ్స్, ఫ్రూట్ ఐస్‌క్రీమ్స్, షుగర్ ఫ్రీ వేరియంట్స్ ఇస్తే అదనపు లాభం పొందొచ్చు.
3. వాటర్ పార్క్ లేదా స్విమ్మింగ్ పూల్ సర్వీస్
వేసవి సెలవుల్లో కుటుంబాలతో పాటు పిల్లలు విహారయాత్రలకు వెళ్ళడం కామన్. ఈ సమయంలో వాటర్ పార్క్స్, స్విమ్మింగ్ పూల్స్‌కు డిమాండ్ అమాంతం పెరుగుతుంది.
- పెట్టుబడి: ₹1 లక్ష – ₹10 లక్షలు (ప్రారంభ స్థాయిలో చిన్న స్విమ్మింగ్ పూల్)
- లాభం: సీజనల్‌గా ₹5 లక్షల వరకు ఆదాయం పొందొచ్చు.
మీ దగ్గర స్థలం ఉంటే చిన్న వాటర్ పార్క్ స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్, టికెట్ సేల్స్, వాటర్ స్పోర్ట్స్ అండ్ అక్టివిటీస్ ద్వారా కూడా ఆదాయం పొందొచ్చు.
4. ఏసీ & కూలర్ రిపేర్ లేదా సేల్స్
వేసవి మోత మోగించిందంటే ఏసీ, కూలర్ డిమాండ్ భారీగా పెరుగుతుంది. వాటి రిపేర్, ఇన్స్టాలేషన్ కోసం మంచి టెక్నీషియన్లను అందుబాటులో ఉంచితే, ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది.
- పెట్టుబడి: ₹30,000 – ₹1 లక్ష
- లాభం: నెలకు ₹50,000 – ₹2 లక్షలు వరకు.
మీ వద్ద టెక్నికల్ స్కిల్ లేకపోయినా సరే, ఒక నిపుణుడిని ఉద్యోగంలో పెట్టుకొని వ్యాపారం ప్రారంభించొచ్చు. ఈ బిజినెస్ లో మంచి ఆదాయం ఉంది.
5. ఐస్ క్యూబ్ వ్యాపారం
హోటల్స్, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, కూల్ డ్రింక్స్ సెంటర్లలో ఐస్ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. వేసవిలో అయితే ఇది మిన్నంటుతుంది.
- పెట్టుబడి: ₹20,000 – ₹50,000
- లాభం: రోజుకు ₹5,000 – ₹15,000 వరకు.
మీ దగ్గర ఫ్రిజ్ లేదా చిన్న డీప్ ఫ్రీజర్ ఉంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. హోటల్స్, కూల్ డ్రింక్స్ స్టాల్స్, ఫంక్షన్ హాల్స్‌తో టై అప్ చేసుకుంటే మంచి ఆదాయం వస్తుంది.
ఫైనల్ గా:
వేసవిలో ఈ 5 బిజినెస్‌లకు భారీ డిమాండ్ ఉంటుంది. మీరు కూడా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసి, మంచి లాభాలు పొందొచ్చు. ఈ బిజినెస్ లలో ఏదైనా ఒకటి ట్రై చేయండి… లాభాలు చూసి మీరే షాక్ అవుతారు.