SSMB 29 ప్రారంభం: సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శక ధీరుడు రాజమౌళి రాబోయే చిత్రం SSMB29. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గ్లోబల్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో అడ్వెంచర్ యాక్షన్ మూవీగా ఈ సినిమా రూపొందనుంది. బాహుబలి సిరీస్ మరియు RRR సినిమాలతో రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. దీంతో సినిమాని ప్రపంచ స్థాయిలో విడుదల చేసేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుందో అనే అంచనాలు చాలా కాలంగా ఉన్నాయి.
మహేష్-రాజమౌళిల SSMB29 ప్రాజెక్ట్ జనవరి 2న ప్రారంభం కానుంది. గురువారం ఉదయం పూజా కార్యక్రమాలతో సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇండస్ట్రీ వర్గాల నుంచి చర్చలు జరుగుతున్నాయి. అయితే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దాదాపు 1000 కోట్లు రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. .
Related News
ఈ సినిమా కోసం మహేష్ లుక్ మార్చేశాడు. అతను పొడవాటి జుట్టు, గడ్డం మరియు కండరాలతో కనిపిస్తాడు. ఈ లుక్‌లో మహేష్‌ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్ నారాయణ నిర్మించనున్నారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రానికి సంబంధించిన అన్ని సెట్స్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. కథతో పాటు అన్ని భాషల వెర్షన్లలో స్క్రీన్ ప్లే, డైలాగ్స్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని టాక్. తెలుగులో ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని విభిన్నమైన పాత్రలో ఆయన నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 2026 వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. జనవరిలో ఈ సినిమా ప్రారంభం కానుందని ఆయన తాజాగా తెలిపారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. గ్లోబల్ రేంజ్ మూవీ కావడంతో ఈ సినిమాలో నటీనటులు ఎవరనేది ఆసక్తిగా మారింది. ఈ భారీ యాక్షన్ చిత్రంలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుందని కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రియాంక హాలీవుడ్‌లో పాపులర్. దీంతో ఆమెతో చిత్ర బృందం చర్చలు జరుపుతున్నట్లు టాక్.
అయితే జనవరి 2న మాత్రమే సినిమా మొదలవుతుందా..? రాజమౌళి కూడా ప్రెస్ మీట్ పెడతాడా అనే ఆసక్తి నెలకొంది. సాధారణంగా రాజమౌళి ప్రతి సినిమా ప్రారంభానికి ముందు మీడియాకు వివరాలు వెల్లడిస్తుంటారు. ప్రెస్ మీట్ పెడితే నటీనటుల విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే రాజమౌళి ఫాలో అవుతాడా..? లేక సస్పెన్స్ కొనసాగిస్తారా? అనేది చూడాల్సి ఉంది.