భవిషత్తు కి వారధి వంటిది పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకోవటం . ఇంతటి ముఖ్యమైన పబ్లిక్ పరీక్షలు ఈ సంవత్సరం మార్చి 17 నుంచి జరగ నున్నాయి . చేతిలో ఉన్న ఈ కొద్ది రోజులు ఎంతో కీలకం.కొత్త సిలబస్ అయినందున విద్యార్థులు అవగాహనతో చదవాల్సిన అవసరం ఉందని సబ్జెక్ట్ నిపుణులు తెలుపుతున్నారు.
ఫిజిక్స్
- భౌతికశాస్త్రంలో మార్కులు సులభం.
- బ్లూ ప్రింట్ ఆధారంగా చదివితే 50కి గరిష్ఠంగా 40.. ప్రతి పాఠాన్ని క్షుణ్నంగా చదివి కీలక అంశాలు నేర్చుకుంటే 50కి 50 మార్కులు సాధించొచ్చు.
- మొత్తం 17 ప్రశ్నలుంటాయి. ఒకటి నుంచి 8 వరకు ఒక మార్కువి, 9, 10, 11కు రెండు, 12, 13, 14కు నాలుగు, చివరి మూడు ప్రశ్నలు 8 మార్కులవి ఉంటాయి.
- భౌతికశాస్త్రంలో నాలుగు, రసాయనశాస్త్రంలో నాలుగు పాఠాలున్నాయి.
ఛాయిస్‌తో కలుపుకొని ఫిజిక్స్ నుంచి 39 మార్కులకు, కెమిస్ట్రీ నుంచి 39 మార్కులకు ప్రశ్నలిస్తారు. - ఐచ్ఛికం 28 మార్కులకు మినహాయిస్తే మిగిలిన యాభైకి పరీక్ష రాయాలి.
- ఇందుకు హస్వదృష్టి, దీర్ఘదృష్టి లోపాలు, ఎండమావులు, ఇంధ్రధనుస్సు ఏర్పడే విధానం, విద్యుత్తు, డీసీ జనరేటర్ పనిచేసే విధానం, నూతన ఆవర్తన పట్టిక నిర్మాణం, కెమికల్ రియాక్షన్, ఈక్వేషన్స్, మెటల్స్, నాన్ మెటల్స్ పాఠాలపై దృష్టిపెట్టాలి.
ఇంగ్లీష్
- చిన్నచిన్న మార్పులతో ప్రశ్నపత్రం పాత విధానంలోనే ఉంటుంది
- మొత్తం మూడు విభాగాలుంటాయి. రీడింగ్ కాంప్రెహెన్షన్‌లో ఇచ్చిన ప్రశ్నలను అర్ధం చేసుకొని సమాధానాలు రాస్తే 30కి 30 మార్కులు పొందొచ్చు.
- రెండో విభాగంలోని గ్రామర్, వకాబులరీలో ఎడిటింగ్‌కు సంబంధించిన వర్క్‌బుక్‌లో పాసేజెస్ సాధన చేయాలి. ఈ విభాగంలో ప్రశ్నలన్నింటికీ వరుస క్రమంలో సమాధానాలు రాయాలి.
- మూడోది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. లెటర్ రైటింగ్‌పై దృష్టిపెట్టాలి. చేతిరాత, అన్ని ప్రశ్నలకు జవాబులు, వరుస క్రమంలో రాయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
మాథెమాటిక్స్
- ఎస్సీఆర్టీ రూపొందించిన మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేస్తే గణితంలో ఉత్తీర్ణత కష్టమేమీ కాదు.
- సి, డి గ్రేడ్ విద్యార్థులు బ్లూప్రింట్‌ను గమనించి సులభమైన చాప్టర్లను ఎక్కువసార్లు అభ్యసనం చేస్తే మార్కులు సులభం.
- కరణులు, సాంఖ్యక శాస్త్రం, సంభావ్యత, గ్రాఫ్ పూర్తిగా నేర్చుకోవాలి.
- బహుపదులు, శూన్య విలువలు కనుగొనుట, మూలాల స్వభావం, కోఆర్డినేట్ జామెట్రీలో మధ్య దూరం కనుగొనుట, త్రికోణీయ నిష్పత్తుల పాఠాలను ప్రత్యేకంగా చదవాలి.
బయాలజీ
- జీవశాస్త్రం విద్యార్థులకు ఎంతో సులభమైన ఇష్టమైన సబ్జెక్టు. సైన్స్‌లో రెండో పేపర్‌గా ఉంటుంది.
- మొత్తం 50 మార్కుల్లో అత్యధికంగా పొందడానికి వీలుంది. ఇందుకుగాను మానవ విసర్జన, పుష్ప నిర్మాణం, మానవ, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, మానవ లింగ నిర్ణయం చిత్రాలు బాగా సాధన చేయాలి.
- కిరణ జన్య సంయోగక్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరం, పిండి పదార్థాలపై లాలాజల చర్య, రైజోపస్ ప్రయోగాలను వివరంగా తెలుసుకోవాలి.
- పట్టికలు, పేరాగ్రాఫ్ ప్రశ్నలపై దృష్టిపెట్టాలి. భేదాలు, కారణాలు, నిర్వచనాల ప్రశ్నలను సాధన చేయాలి. డయాఫ్రంల సాధన, ఫ్లోచార్ట్స్ గుర్తుపెట్టుకోవడం అవసరం.
తెలుగు
- తెలుగులో మొత్తం మూడు విభాగాలుంటాయి. మొదటికి 32, రెండుకు 36, మూడుకు 32 మార్కులు కేటాయిస్తారు.
- మొదటి భాగం అవగాహన ప్రతిస్పందనలో నాలుగు ప్రశ్నలు 32 మార్కులకిస్తారు. ఒకటి, మూడు, 9వ పాఠాల్లోని కంద, ఆటవెలది, తేటగీతి పద్యాల్లో రెండు ఇస్తారు. భావాన్ని అర్థం చేసుకుని సమాధానం రాయాలి.
రెండో విభాగం వ్యక్తీకరణ, సృజనాత్మకత. పద్యభాగంలోని కవుల్లో ఒకరిని ఇచ్చి పరిచయం చేయమంటారు. - గద్యభాగం నుంచి ప్రక్రియ లేదా నేపథ్యాన్ని రాయాల్సి ఉంటుంది.
రామాయణం నుంచి పాత్ర స్వభావం ఒకటి రాయాలి. - విభాగం మూడులో భాషాంశాలపై ప్రశ్నలొస్తాయి. అలంకారం, ఛందస్సు, పర్యాయపదాలు, నానార్థాలను చదివితే సరిపోతుంది.
హిందీ
- గత ప్రశ్నపత్రంతో పోలిస్తే ఇప్పుడు ఇవ్వబోయేది ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది.
- ప్రశ్నపత్రంలో మొత్తం ఆరు విభాగాలుంటాయి. మొదటి భాగంలో వ్యాకరణాంశాలు, రెండులో పద్యభాగానికి సంబంధించిన రెండు, గద్య భాగంలో రెండు పేరాగ్రాఫ్‌లు ఉంటాయి. వాటి కింద ప్రశ్నలడుగుతారు.
ప్రశ్న చదివేటప్పుడే అవగాహన చేసుకుంటే జవాబులు సులువుగా రాయవచ్చు. - మూడో భాగంలో ప్రాచీన కవి లేదా ఆధునిక కవి గురించి రాయాల్సి ఉంటుంది. మీరాబాయి కబీర్‌దాస్‌ల గురించి బాగా చదివితే సరిపోతుంది. సీతారాం సేక్సరియా పాఠ్యాంశం ముఖ్యమైంది.
- నాలుగో భాగంలో 8 ప్రశ్నలిస్తారు. ఆరింటికి సమాధానం రాయాలి. మూడు పద్యభాగం, మూడు గద్యభాగం నుంచి ఉంటాయి.
సాంఘికశాస్త్రం
- అర్థం చేసుకొని సమాధానాలు రాయగలిగితే సాంఘికశాస్త్రంలో నూటికి నూరు మార్కులు సాధించవచ్చు.
- నాలుగు విభాగాల్లో మొత్తం 33 ప్రశ్నలుంటాయి. భూగోళశాస్త్రం 23, చరిత్ర 23, పాలిటిక్స్ 23, ఆర్థికశాస్త్రం 23, మ్యాప్ పాయింట్‌కు 8 మార్కులు కేటాయిస్తారు.
- జవాబులను ఉప శీర్షికలు(సైడ్ హెడ్డింగ్స్)తో రాయాలి.
అడిగిన ప్రశ్నకు జవాబులు సూటిగా రాస్తే దిద్దేవారికి మంచి అభిప్రాయం కలుగుతుంది. - సమాచారం నైపుణ్యాల ప్రశ్నలు పట్టిక రూపంలో లేదా గ్రాఫ్‌లో పొందుపరిచి ఇస్తారు. సమాధానం రాయడం సులువే. నిత్య జీవితంలో మనకు తారసపడే వాటితో పోలుస్తూ గుర్తుంచుకుంటే మ్య