Smartphone వేడెక్కకుండా ఉండటానికి, ఫోన్ ఎక్కువ సూర్యరశ్మికి గురికాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఇటీవల చాలా మంది బైక్కు ముందు ఫోన్ను అమర్చుతున్నారు. ఫలితంగా, ఫోన్ బ్యాటరీ త్వరగా వేడెక్కుతుంది, ఇది ఫోన్ పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
గేమింగ్, GPS నావిగేషన్ మరియు video streaming కూడా ఫోన్ త్వరగా వేడెక్కడానికి కారణం కావచ్చు. అలాగే ఫోన్ లో ఒకేసారి అనేక పనులు చేస్తే ఫోన్ హీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫోన్ వాడే విధానం కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజుల్లో దాదాపు అన్ని smartphoneలలో బ్యాటరీ సేవింగ్ మోడ్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ని ఆన్ చేయడం ద్వారా, background process లో ఆపరేషన్లు నియంత్రణలో ఉంటాయి. దీంతో ఫోన్ హీటింగ్ తగ్గుతుంది.
smartphoneవేడెక్కకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు smartphone కేస్ ను తీసివేయాలి. ఫోన్ రక్షణ కోసం వాడే కేస్ వల్ల బ్యాటరీ నుంచి వచ్చే వేడి బయటకు పోకుండా ఫోన్ దానంతట అదే వేడిగా మారుతుంది.
బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఫీచర్లను అవసరం లేకపోయినా ఆన్లో ఉంచుకోవడం వల్ల బ్యాటరీ త్వరగా డ్రై అయిపోవడమే కాకుండా ఫోన్ వేడెక్కుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అవసరం లేనప్పుడు ఇలాంటి ఫీచర్లను ఆన్ చేయకపోవడమే మంచిది.