SLBC: SLBC ఘటన.. సొరంగంలో కాల్వల పారుతున్న నీరు..!!

SLBC సొరంగంలో మిగిలిన ఏడు మృతదేహాల కోసం సోమవారం 24వ రోజుకు చేరుకున్న సహాయక చర్యలు. ప్రధానంగా సింగరేణి, సౌత్ సెంట్రల్ రైల్వే, రాట్ హోల్ మైనర్స్, ఇతర బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌ను 24 గంటలూ కొనసాగిస్తున్నాయి. అయితే, గత 24 రోజులుగా, విపత్తు నిర్వహణ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ రఘునాథ్ గైక్వాడ్, ఇతర రెస్క్యూ బృందాలు, సీనియర్ అధికారులు వారితో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెస్క్యూ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి తగిన సూచనలు, మార్పులు, చేర్పులు చేస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

సొరంగంలో కాలువలా ప్రవహిస్తున్న నీరు

SLBC సొరంగంలో ఊట నీరు అస్సలు తగ్గలేదు. సొరంగం నుండి 13.5 కిలోమీటర్ల తర్వాత ఏర్పాటు చేసిన D2 ప్రాంతంలో ఒక కాలువ పెరుగుతోంది. ఇది రెస్క్యూ కార్యకలాపాలకు ప్రధాన అడ్డంకిగా మారుతోంది. ప్రతి రెండున్నర కిలోమీటర్లకు ఒకసారి పంపింగ్ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ వరద నీరు రోజురోజుకూ తగ్గకుండా కాలువలా ప్రవహిస్తోంది. గత నాలుగు రోజులుగా ప్రభుత్వం సూచించినట్లుగా రోబో సేవలను ఉపయోగించి సహాయ చర్యలను వేగవంతం చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Related News

కానీ సాంకేతిక అడ్డంకులను అధిగమించిన తర్వాత రోబో పనిచేయడం ప్రారంభించేలా సోమవారం నుండి పూర్తి స్థాయి రోబో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దక్షిణ మధ్య రైల్వే రెస్క్యూ బృందం TBT మిషన్ శకలాలను కత్తిరించి భాగాలుగా పంపుతోంది. అదేవిధంగా, D-1 చాలా ప్రమాదకరమైన ప్రదేశంగా గుర్తించిన అధికారులు, ఆ ప్రాంతంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొనే వారికి ఎటువంటి చిన్న హాని జరగకుండా ఏడుగురు మృతుల కోసం అన్వేషణను కొనసాగిస్తున్నారు.