Sim Cards: ఒక వ్యక్తి ఎన్ని సిమ్‌ కార్డులు తీసుకోవచ్చు..!

చేతిలో ఫోన్ లేని వారు ఉండరనడంలో సందేహం లేదు. పెరుగుతున్న టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లు ఇస్తుండటంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులు తీసుకుంటున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ముఖ్యంగా డ్యూయల్ సిమ్ ఫీచర్ ఉన్న ఫోన్లు రావడంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులు వాడుతున్నారు. అయితే ఒక వ్యక్తికి ఎన్ని సిమ్ కార్డులు ఉండవచ్చు. అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం..

SIM  ఉచితంగా లభిస్తుండడంతో చాలా మంది సిమ్ కార్డులు వాడుతూ వాటిని బ్లాక్ చేయకుండా పక్కన పడేస్తున్నారు. అలాగే ఆధార్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న ఘటనలు, కొంతమంది మనకు తెలియకుండానే మన ఆధార్‌తో సిమ్‌ కార్డులు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఒక ఆధార్ కార్డుతో గరిష్ఠంగా 9 సిమ్ కార్డులను మాత్రమే తీసుకునేందుకు అనుమతి ఉందని అధికారులు చెబుతున్నారు. నేరాల సంభావ్యతను తగ్గించడానికి, సిమ్ కార్డులను పెద్దమొత్తంలో నిషేధించారు.

మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

అయితే దీనికి కూడా ఒక మార్గం ఉంది. డాట్.. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAF-COP) మీ ID కార్డ్‌లో ఎన్ని SIM కార్డ్‌లు ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక ప్లాట్‌ఫారమ్‌తో ముందుకు వచ్చింది. దీని సహాయంతో మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు జారీ అయ్యాయో తెలుసుకోవచ్చు. మీ ఫోన్‌ని ఎవరైనా దొంగిలిస్తే.. దాన్ని బ్లాక్ చేసే అవకాశం ఉంది.

దీని కోసం ముందుగా sancharsathi వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఆ తర్వాత ‘సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్’ కింద కనిపించే ఆప్షన్‌లో ‘మీ మొబైల్ కనెక్షన్‌లను తెలుసుకోండి’పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు మీ మొబైల్ నంబర్ మరియు క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. వెంటనే మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది. OTPని నమోదు చేసిన తర్వాత, ఆ వినియోగదారు పేరులోని మొబైల్ నంబర్‌ల జాబితా కనిపిస్తుంది. అందులో ఉన్న ఫోన్ నంబర్లు మీవేనా? ఇది తనిఖీ చేయండి. అది మీది కాకపోతే, వెంటనే దాన్ని బ్లాక్ చేయడానికి మీకు అవకాశం ఇవ్వబడింది.

మీ పోయిన SIM ని ఈ లింక్ ద్వారా బ్లాక్ చేయండి

మీ పేరు మీద ఎన్ని SIM కార్డు లు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి

SANCHARSATHI LINK: https://www.sancharsaathi.gov.in/