ఏ బిడ్డకైనా తండ్రి సూపర్ హీరో. ముఖ్యంగా అమ్మాయిలు తమ తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తారు. ఎవరైనా వేధిస్తే తండ్రికి చెప్పాలనుకుంటారు . అయితే సొంత తండ్రే వేధిస్తే..
కన్నవాళ్ళే లైగింక వేధింపులకు గురి చేస్తే ఎలా?.. సీనియర్ నటి ఖుష్బూ సుందర్ ఈ కష్టాలను తట్టుకుంది. చాలా సందర్భాలలో తన తండ్రి లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని ఆమె బహిరంగంగా చెప్పింది. తాజాగా ఆమె తన తండ్రి వల్ల పడిన కష్టాలను, కుటుంబంలో పడిన ఇబ్బందులను మరోసారి బయటపెట్టింది. తన తండ్రి చేసిన లైంగిక వేధింపులను బయటపెడితే ఇబ్బందులు పడతానేమోనన్న భయంతోనే చాలా కాలం దాచిపెట్టానని చెప్పింది. కెరీర్ పరంగా బాగా నిలదొక్కుకున్న తర్వాతే తండ్రితో తలపడ్డానని చెప్పింది.
మా నాన్న వాళ్ళ లైంగిక వేధింపులను కూడా ఎదుర్కొన్నాను. నా తల్లిని, సోదరులను క్రూరంగా హింసించేవాడు. బెల్టు, చెప్పులు, కర్రతో ఏది దొరికినా కొట్టేవాడు.. ఇలాంటి వేధింపులు నా చిన్నతనంలో చూశాను. నాపై జరిగిన లైంగిక వేధింపులను బయటపెడితే, అతను నన్ను మరింత హింసిస్తాడనే భయంతో నేను అతనికి చెప్పలేదు. చెన్నైకి వచ్చి సొంత కాళ్లపై బతకడం మొదలుపెట్టాక నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ తర్వాత కూడా నాన్న నన్ను దుర్భాషలాడారు.
Related News
నేను తిరిగి పోరాడాను. తట్టుకోలేక షూటింగ్ లొకేషన్ కి వచ్చి అందరి ముందు నన్ను కొట్టేవాడు. ఉబిన్ అనే హెయిర్‌డ్రెస్సర్ నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పాడు. మా నాన్న 14 ఏళ్ల వయసులో చేసిన లైంగిక వేధింపుల గురించి తాను చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అతను మమ్మల్ని విడిచిపెట్టాడు. ఎక్కడికి వెళ్లాడన్న విషయం కూడా మేం విచారించలేదు. మేము అతనిని ఎప్పుడూ కలవలేదు. గతేడాది మృతి చెందినట్లు బంధువుల ద్వారా తెలిసింది. కానీ నేను ఆయన్ను చూసేందుకు కూడా వెళ్లలేదు’ అని ఖుష్భూ చెబుతోంది.