SBI SO Recruitment 2024: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ State Bank of India నిరుద్యోగులకు శుభవార్త అందించింది. SBI ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ MMGS-II, మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ కింద 150 పోస్టులను భర్తీ చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అర్హత: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అంతే కాకుండాtrade finance processing లో కనీసం రెండేళ్ల పని అనుభవంతో పాటుగా IIBF ఫారెక్స్ సర్టిఫికేట్.
వయోపరిమితి: అభ్యర్థులు December 31, 2023 నాటికి 23 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్ షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
Related News
పరీక్ష ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ. 750 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ వికలాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
జీతం: రూ. 48,170- 69,810.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 27, 2024.
SBI ఉద్యోగాలు: రాత పరీక్ష లేకుండా SBIలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోవడానికి 1 రోజు మాత్రమే అవకాశం