‘రోబో’ ఆత్మహత్య..ఈ వార్తతో ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతి …!

జీవితంలో ఎదురయ్యే కష్టాలు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారనే సంగతి తెలిసిందే.. అయితే ‘ఆత్మహత్య’ చేసుకున్న ROBOT గురించి ఎప్పుడైనా విన్నారా?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇదేం విచిత్రం అని ఆలోచిస్తున్నారా? నువ్వే కాదు.. ప్రపంచం మొత్తం భయాందోళనకు గురవుతోంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఇటీవల South Korea లో robot ‘ఆత్మహత్య’కు పాల్పడింది.

గుమి నగరంలోని సిటీ హాల్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ robot ఉద్దేశపూర్వకంగా రెండు మీటర్ల ఎత్తున్న మెట్లపై నుంచి కిందకు దూకింది. కదలకుండా కనిపించింది. ఆత్మహత్యకు ముందు రోబో వింతగా ప్రవర్తించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

అధిక పనిభారం లేదా యంత్రంలో సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను దేశంలోనే తొలి రోబో ఆత్మహత్యగా స్థానిక మీడియా, నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. అయితే ఈ ఘటనను ‘ఆత్మహత్య’గా పేర్కొనడం నమ్మశక్యంగా కనిపించడం లేదు. ఎందుకంటే.. రోబోలకు భావోద్వేగాలు, ఆత్మ విధ్వంసకర సామర్థ్యం లేవని, ఇది ఎలా జరిగిందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. navigation  లో లోపాలు, sensors వైఫల్యం, robot  కదలికలకు దోహదపడేprogramming bug  కారణంగా robot వింతగా ప్రవర్తించి ఉండొచ్చనే చర్చ సాగుతోంది.