Rajamouli-Mahesh దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా pan world movie రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా కోసం తెలుగు అభిమానులే కాదు ఇండియాలోని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
ఎందుకంటే రాజమౌళి ఇంతకుముందు బాహుబలి, ట్రిపుల్ ఆర్ చిత్రాలతో భారీ బూమ్ క్రియేట్ చేసాడు.. దాంతో రాజమౌళి సినిమా కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి రాజమౌళి నుంచి సినిమా లేట్ కావచ్చు కానీ సినిమా విడుదలయ్యాక ఆ అంచనాలకు మించిన సంతృప్తి దొరుకుతుందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా తెరకెక్కిస్తూ విజువల్ వండర్ ని తెరపై చూపించడంలో ఎప్పుడూ సక్సెస్ అవుతాడు.
ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా విషయంలో కూడా అదే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ పాన్ వరల్డ్‌లో జరగడంతో రాజమౌళి అడ్వెంచర్ జానర్‌ని ఎంచుకున్నారు. ఎందుకంటే హాలీవుడ్ స్టాండర్డ్ లో అంటే అడ్వెంచర్ జానర్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఆ జానర్ ని ఎంచుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అందులో ఒకటి కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయితే మరొకటి హీరో పాత్ర.
ఈ డ్యూయల్ రోల్ మేకప్ కోసం హాలీవుడ్ మేకప్ మెన్ మేకప్ వేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే August 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆ రోజున ఈ సినిమా కాన్సెప్ట్ వీడియోని రిలీజ్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.