Rain Alert: తరుముకొస్తున్న పెను తుఫాను.. 3 రోజులు అతిభారీ వర్షాలు

విశాఖపట్నం, నవంబర్ 25: ఏపీని వర్షాలు వదలడం లేదు. చలికాలం ప్రారంభమైనా వర్షాల జోరు మాత్రం తగ్గడం లేదు. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం స్థిరంగా ఉంది. ఆదివారం రాత్రి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది పశ్చిమం నుండి వాయువ్య దిశగా కదులుతుంది. ఇది క్రమంగా బలపడి సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో తుపాను వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో రైతులు, సామాన్య ప్రజలను వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఆ తర్వాత వాయువ్య దిశగా పయనించి బుధవారం (నవంబర్ 27) సాయంత్రం తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుంది. శ్రీలంక సమీపంలో తీరం దాటే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో సోమవారం నుంచి వర్షాలు కురుస్తాయి. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. తుపాను ప్రభావంతో నవంబర్ 27 నుంచి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మరోవైపు రాయలసీమ జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ప్రాంతంలో బలమైన గాలులు వీస్తున్నాయని, వాటి ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారిందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గరిష్ఠంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని స్పష్టం చేశారు. మంగళవారం నుంచి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఈ నెల 29 వరకు మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా చలి గాలులు వీస్తున్నాయి. ఉదయం నుంచే చలి తీవ్రంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అదేవిధంగా తెలంగాణలో చలి రోజురోజుకూ పెరుగుతోంది.

Related News