సెన్న్హైజర్ (Sennheiser) నుంచి మరో హై-ఫై ఆడియో గాడ్జెట్ మార్కెట్లోకి వచ్చింది. ప్రముఖ జర్మన్ బ్రాండ్ తాజాగా Sennheiser HD 505 Over-Ear Headphones (Copper Edition)ను ఇండియాలో లాంచ్ చేసింది. ధరను రూ.27,990గా ప్రకటించింది. ప్రస్తుతం Amazonలో లభిస్తుంది, త్వరలో సెన్న్హైజర్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అమ్మకాలు మొదలవుతాయి.
ఫీచర్లు ఏమిటంటే?
ఈ హెడ్‌ఫోన్లు ఓపెన్-బ్యాక్ డిజైన్‌తో వస్తాయి. దీని వల్ల సౌండ్ స్టేజ్ మరింత బ్రాడ్‌గా, క్లియర్‌గా వినిపిస్తుంది. సెన్న్హైజర్ ఇన్-హౌస్ 120 Ohms ట్రాన్స్‌డ్యూసర్ వినియోగించింది, ఇది ఐర్లాండ్‌లోని టల్లమోర్ ప్లాంట్‌లో తయారైంది.
వినిపించే రేంజ్ ఎలా ఉంటుందంటే:
ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్: 12Hz – 38,500Hz. సౌండ్ ప్రెజర్ లెవల్ (SPL): 107.9dB. టోటల్ హార్మోనిక్ డిస్టోర్షన్ (THD): 0.2% కంటే తక్కువ. కేబుల్: 1.8మీటర్ల డిటాచబుల్ కేబుల్ (3.5mm కనెక్టర్‌తో), అదనంగా 6.35mm అడాప్టర్ కూడా ఉంది.
కంఫర్ట్ & డిజైన్ విషయంలో:
ఈ Sennheiser HD 505 హెడ్‌ఫోన్‌లు సింథటిక్ లెదర్ హెడ్‌బ్యాండ్‌తో, మెటల్ మెష్ కవర్ ఉన్న ఇయర్ కప్‌లతో వస్తాయి. కేవలం 237 గ్రాముల బరువు మాత్రమే ఉంది. మార్పిడి అయ్యే కేబుల్స్, ఇయర్ ప్యాడ్స్‌తో పాటు డ్రాస్ట్రింగ్ పౌచ్ కూడా ఉంది.
ఓపెన్-బ్యాక్ హెడ్‌ఫోన్‌తో బ్రాడ్ సౌండ్ స్టేజ్ అనుభవించాలనుకునే మ్యూజిక్ లవర్స్‌కి ఇది బెస్ట్ చాయిస్. ప్రొఫెషనల్ సౌండ్ కోసం చూస్తున్నవాళ్లు తప్పకుండా ట్రై చేయవచ్చు.