ఈ రోజుల్లో చాలా మంది పెద్ద ఎత్తున పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి ఒక్కరికీ బ్యాంకులు, పోస్టాఫీసులలో అనేక పొదుపు పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా పోస్టాఫీసులలో, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా అనేక పొదుపు పథకాలు అమలు చేయబడుతున్నాయి. ఈ క్రమంలో పోస్టాఫీస్ ఉత్తమ పథకాన్ని అందిస్తుంది. ఈ పథకం ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంది. మీరు వ్యక్తిగత ఖాతాలో తొమ్మిది లక్షల రూపాయల వరకు, ఉమ్మడి ఖాతాలో 15 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. వార్షిక వడ్డీ రేటు 7.4 శాతం. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత, నెలకు రూ. 5,500 ఆదాయం వినియోగదారుడి పోస్టాఫీసు పొదుపు ఖాతాలో జమ చేయబడుతుంది. ఈ పథకం ముగింపులో లబ్ధిదారులకు వడ్డీగా 3 లక్షల 30 వేల రూపాయలు లభిస్తాయి.
POST OFFICE: పోస్టాఫీసు స్కీమ్.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ. 5500!

20
Feb