Post Office Scheme: పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. నెలకు రూ. వెయ్యి ఆదా చేస్తే చాలు..!

Post Office Recurring Deposit Scheme : ప్రతి ఒక్కరూ తమ సంపాదనను చాలా వరకు ఆదా చేసుకోవాలని కోరుకుంటారు. వారి వారి ఆదాయానికి అనుగుణంగా ఎంత పొదుపు చేయాలని ప్లాన్ చేస్తారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కానీ కష్టపడి సంపాదించిన డబ్బుకు భద్రతతో పాటు రాబడిని ఆశించడం సర్వసాధారణం. అలాంటి వారి కోసం ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్నో పథకాలు తీసుకొచ్చాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పోస్టాఫీసు పథకాల గురించి.

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినPost Office లో పెట్టుబడి పెట్టడం ద్వారా డబ్బు భద్రతతో పాటు మంచి రాబడిని పొందవచ్చు. RD (రికరింగ్ డిపాజిట్) అనేది పోస్ట్ ఆఫీస్ అందించే ఉత్తమ పథకాలలో ఒకటి. ఈ పథకం చాలా బ్యాంకులు అలాగే Post Office లలో అందించబడుతుంది. ఈ పథకంలో ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయి.

Related News

ఈ పథకంలో పెట్టుబడి పెట్టే వారికి కేంద్రం 6.7 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 ​​సంవత్సరాలు. మెచ్యూరిటీ తర్వాత కావాలనుకుంటే ఈ పథకాన్ని మరో 5 ఏళ్లపాటు పొడిగించుకోవచ్చు. ఇందులో కనీసం రూ. 100 నుండి గరిష్ట మొత్తం డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకంలో ఉంటే నెలకు రూ. 1000 చొప్పున డిపాజిట్ చేస్తే ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకోవచ్చు.

మీరు రూ. 1000 పొదుపు, ఐదేళ్ల తర్వాత వడ్డీతో కలిపి రూ.71 వేలు అవుతుంది. అంటే 5 ఏళ్ల తర్వాత చేతికి రూ.71 వేలు అందుతాయి. అలాగే, మీరు ఈ పథకంలో నెలకు 1000 రూపాయలను మరో 5 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే, పదేళ్ల తర్వాత మీరు డిపాజిట్ చేసిన మొత్తం రూ. 1.20 లక్షలు. దానిపై వడ్డీ దాదాపు రూ. 50 వేలు వస్తాయి. అంటే మొత్తం రూ.1.70 లక్షలు మీ చేతికి వస్తాయి.