PM Modi to Amaravathi: ప్రధాని మోదీ అమరావతి పర్యటన.. ఫుల్ షెడ్యూల్ విడుదల

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 2న ఏపీ రాజధాని అమరావతికి చేరుకుంటారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమవుతాయి. తరువాత, మోడీ అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

దీని కోసం ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. ప్రధాని పాల్గొనే బహిరంగ సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించడానికి కూటమి నాయకులు ప్రణాళికలు రూపొందించారు. ఈ సమావేశానికి దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా.

ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది.

షెడ్యూల్ ప్రకారం..

  • మే 2న మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
  • అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా అమరావతిలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
  • అక్కడి నుంచి 1.1 కి.మీ. పొడవైన రోడ్ షోలో 15 నిమిషాల పాటు పాల్గొంటారు.
  • ఆ తర్వాత, మధ్యాహ్నం 3.45 గంటలకు మోడీ అమరావతి పెవిలియన్‌ను సందర్శిస్తారు.
  • సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభంతో పాటు బహిరంగ సభలో పాల్గొంటారు.
  • సాయంత్రం 5 గంటలకు అమరావతి నుండి తిరిగి వస్తారు.
  • సాయంత్రం 5.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి వెళతారు.
  •  గన్నవరం నుండి బయలుదేరి సాయంత్రం 5.20 గంటలకు ఢిల్లీకి బయలుదేరుతారు.

ప్రధానమంత్రి సమావేశానికి అధికారులు మూడు వేదికలను సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మొత్తం 20 మంది ప్రముఖులు కూర్చుంటారు. మిగిలిన వీవీఐపీల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు. సుమారు 100 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీకి వచ్చే ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా అసెంబ్లీ ప్రాంగణానికి ఎనిమిది రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. కూటమి నాయకులు 11 పార్కింగ్ స్థలాలను సిద్ధం చేస్తున్నారు.