రైతులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే ప్రధానమంత్రి కిసాన్ నిధులు నేడు విడుదల కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు నిధులను విడుదల చేయనున్నారు. బీహార్‌లోని భాగల్పూర్‌లో జరగనున్న కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో రైతులకు రూ.22 వేల కోట్ల విలువైన 19వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల కానున్నాయి. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకు రూ.2 వేల చొప్పున 3 విడతలుగా రూ.6 వేలు సహాయం చేస్తోంది. 2019లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా కేంద్రం ఇప్పటివరకు 18 విడతలుగా రూ.3.46 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది.
PM Kisan: నేడు పీఎం కిసాన్ నిధుల విడుదల..

24
Feb