సాధారణ ఎన్నికల సందర్భంగా డ్యూటీ చేసిన వారికీ … ఒక నెల ఎన్నికల గౌరవ పారితోషికం ఇవ్వమని నిన్న ఎలక్షన్ కమిషన్ ఒక ఆర్డర్ ఇచ్చింది
అయితే ఎలక్షన్ డ్యూటీ చేసిన ప్రతి వారికీ ఇదివర్తిస్తుందా లేదా?
దీనికి ఎవరెవరు అర్హులు అంటే
- GAD (ఎలక్షన్స్) లోని అందరూ అధికారులు & సిబ్బందికి.. అనగా
- అన్ని జిల్లాలలోని ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా పాల్గొన్న సిబ్బందికి అనగా
- జిల్లా ఎలక్షన్ అధికారులు,
- జిల్లా రెవెన్యూ అధికారులు,
- రిటర్నింగ్ అధికారులు,
- అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు,
- సూపరింటెండెంట్ లు,
- డిప్యూటీ తహసిల్దార్ లు (ఎలక్షన్స్),
- సీనియర్ అసిస్టెంట్ లు,
- జూనియర్ అసిస్టెంట్ లు,
- టైపిస్టులు మొదలగువారు
ఒక నెల ఎన్నికల గౌరవ పారితోషికం ఎవరికి వర్తించదుఅంటే ..
- పోలింగ్ మరియు కౌంటింగ్ నిర్వహణకు లిమిటెడ్ పీరియడ్ కు డ్రాఫ్ట్ చేయబడిన..
- జోనల్ అధికారులు
- రూట్ ఆఫీసర్లు
- ప్రిసైడింగ్ ఆఫీసర్లు
- అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు
- ఓపిఓలు
- అబ్జర్వర్లు
- మైక్రో అబ్జర్వర్లు
- కౌంటింగ్ అధికారులు మొదలగు వారు