ఈ స్కీమ్ చాలా అవసరమైనది, ఎందుకంటే బీపీఎల్ (below Poverty Line) కింద ఉన్న వృద్ధులకు ఈ సాయం ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం వారికి చాలా సహాయకరంగా ఉంటుంది, వారు పింఛను పొందకుండా గడిపే రోజులు ఇక నుంచి ఉండవు.
ఈ స్కీమ్ కి కావలసిన అర్హతలు
ఈ పెన్షన్ స్కీమ్ కి అప్లై చేయడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. మీరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత నివాసి కావాలి మరియు 60 నుండి 150 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతాలవారికి వారి వార్షిక ఆదాయం ₹46,080 కంటే ఎక్కువ ఉండకూడదు, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు ₹56,460 కంటే ఎక్కువ ఆదాయం పొందకూడదు.
అవసరమైన డాక్యుమెంట్స్
పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయ సర్టిఫికెట్ మరియు వవయస్సు సర్టిఫికెట్.
Related News
దరఖాస్తు ఎలా?
దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో చేయవచ్చు. ఆన్‌లైన్ ద్వారా మీరు దరఖాస్తు చేసే ప్రక్రియ చాలా సులభం. దరఖాస్తు చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://sspy-up.gov.in/HindiPages/oldage_h.aspx ను సందర్శించండి. అక్కడ “Old Age Pension” అనే ఎంపికను క్లిక్ చేసి, “Apply Online” అనే ఆప్షన్‌ను ఎంచుకుని, మీ వివరాలు ఫారం లో నింపవచ్చు.
ఈ ఫారమ్‌లో మీరు మీ జిల్లా, గ్రామం, పేరు, జన్మ తేదీ, చిరునామా, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఎంటర్ చేయాలి. తరువాత బ్యాంకు వివరాలను కూడా జత చేయాలి, ఉదాహరణకు బ్యాంకు పేరు, శాఖ, ఖాతా సంఖ్య, IFSC కోడ్, income certificate ను కూడా జతచేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ పెన్షన్ పథకాన్ని పొందవచ్చు.