₹1 పెట్టుబడితో బంగారం కొనాలని ఉందా? ఈ డిజిటల్ గోల్డ్ ట్రెండ్ మిస్ కాకండి…

ఈ రోజుల్లో బంగారం కొనడం ఇంకా సులభమైంది. డిజిటల్ గోల్డ్ అనే కొత్త పెట్టుబడి అవకాశం అందరికి అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా మీరు కేవలం ₹1 నుండి కూడా బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇంట్లో భద్రంగా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా, ఎప్పుడైనా కొనుగోలు, అమ్మకాలు చేయగలిగే వెసులుబాటు దీనిలో ఉంటుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 మీ చేతుల్లో పూర్తి నియంత్రణ

మీరు ఎంత పెట్టుబడి పెట్టాలో మీరు నిర్ణయించుకోవచ్చు. చిన్న మొత్తాలతో ప్రారంభించి, కొద్దికొద్దిగా మీ బంగారం నిల్వ పెంచుకోవచ్చు. అవసరం అయితే అది నగదుగా మార్చుకోవచ్చు లేక ఫిజికల్ గోల్డ్‌గా పొందవచ్చు. మరి ఇంత సులభమైన పెట్టుబడి అవకాశాన్ని మిస్ అవుతారా?

భద్రతతో కూడిన పెట్టుబడి

డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేసిన వెంటనే విశ్వసనీయమైన సంస్థల వద్ద భద్రంగా నిల్వ చేస్తారు. 100% భద్రతతో, ఇన్సూరెన్స్‌తో పాటు, అవసరమైనప్పుడు మీరు మీకు నచ్చిన సమయంలో విక్రయించగలిగే వెసులుబాటు కూడా ఉంటుంది.

Related News

రియల్ టైం ధర – బంగారం ఎప్పుడు కొనాలి? ఎప్పుడు అమ్మాలి?

డిజిటల్ గోల్డ్ ఎప్పుడూ లైవ్ ధరలతో కనిపిస్తుంది, అందువల్ల మీరు తక్కువ ధరలో కొనుగోలు చేసి, ఎక్కువ ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. ఇకపై బంగారం కొనేందుకు దుకాణాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మీ ఫోన్‌లోనే క్లిక్ చేస్తే చాలు

ఈ కొత్త ట్రెండ్‌ను ఎందుకు మిస్ అవుతారు?

టెక్నాలజీ అభివృద్ధితో డిజిటల్ గోల్డ్ ఇప్పుడు అందరికి అందుబాటులో ఉంది. భద్రత, సౌలభ్యం, అధిక లిక్విడిటీ – ఇవన్నీ దీనిని పెట్టుబడిదారులకు అత్యుత్తమ ఆప్షన్ గా మార్చాయి. అయితే అధిక భద్రత కలిగిన, నమ్మకమైన ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే ఎంచుకోవడం ముఖ్యం. డిజిటల్ గోల్డ్ మీ సంపదను భద్రంగా పెంచుకునేందుకు బెస్ట్ మార్గం అని చెప్పొచ్చు