కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన IRCON International Limited ఇటీవల మేనేజర్ పోస్టుల కోసం కొత్త ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇది ఇంజనీరింగ్ విద్యార్థులకు చాలా పెద్ద అవకాశం.
మొత్తం ఖాళీలు – 4 మాత్రమే
ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఈసారి మొత్తం నాలుగు పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులు తక్కువగా ఉండటంతో పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
అర్హత – B.Tech పూర్తి చేసినవారికి మాత్రమే
ఈ ఉద్యోగాలకు అర్హతగా B.Tech పూర్తి చేసి ఉండాలి. మీరు ఈ కింద పేర్కొన్న విభాగాల్లో చదివి ఉండాలి: ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
Related News
అలాగే సంబంధిత రంగంలో అనుభవం ఉండటం కూడా తప్పనిసరి.
జీతం – రూ.60,000 నుండి రూ.1,80,000 వరకూ
ఎంపికైన అభ్యర్థులకు నెలకు కనీసం రూ.60,000 నుంచి గరిష్ఠంగా రూ.1.80 లక్షల వరకు జీతం లభిస్తుంది. ఇది ప్రభుత్వ రంగ ఉద్యోగం కావడంతో పింఛన్, ఇతర అలవెన్సులూ లభిస్తాయి.
వయస్సు పరిమితి – గరిష్ఠంగా 37 ఏళ్లు
2025 ఏప్రిల్ 1నాటికి అభ్యర్థులు గరిష్ఠంగా 37 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలకు చట్టప్రకారం వయస్సులో రాయితీలు ఉంటాయి: ఓబీసీలకు: 3 ఏళ్లు. ఎస్సీ / ఎస్టీ: 5 ఏళ్లు. పీడబ్ల్యూడి (PWD): 10 ఏళ్లు
ఎంపిక విధానం – రాత పరీక్ష & ఇంటర్వ్యూ
అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. మార్కులతో పాటు అభ్యర్థి నైపుణ్యాలు కూడా పరీక్షిస్తారు.
దరఖాస్తు విధానం – ఆఫ్‌లైన్ అప్లికేషన్
ఈ పోస్టుకు అప్లై చేయాలంటే మీరు ఆఫ్‌లైన్ దరఖాస్తు చేయాలి. మీ అప్లికేషన్‌ను సంబంధిత డాక్యుమెంట్లతో కలిపి ఈ అడ్రస్‌కు పంపాలి: JGM, HRM, IRCON International Limited, C-4, District Centre, Saket, New Delhi – 110017.
దరఖాస్తు ఫీజు వివరాలు
జనరల్, ఓబీసీ: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్-సర్వీస్మెన్: ఫీజు మినహాయింపు.
చివరి తేదీ – మే 25, 2025
మీ అప్లికేషన్ మే 25, 2025లోగా IRCON కార్యాలయానికి చేరాలి. ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్లను పరిగణలోకి తీసుకోరు.
ఇది మీ భవిష్యత్‌ను మార్చే ఛాన్స్
ఇంత మంచి జీతం, సురక్షిత ఉద్యోగ భవిష్యత్తుతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ గౌరవం కూడా లభించే ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి. ఒకసారి అప్లై చెయ్యండి, లైఫ్ సెటిల్ కావచ్చు