Government of Andhra Pradesh Chief Secretary (CS )గా Senior IAS Nirabh Kumar Prasad నియమితులయ్యారు. 1987 బ్యాచ్కి చెందిన ఆయన.. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ మేరకు ఆయనను CSగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. K.S . ఇప్పటి వరకు CS గా ఉన్న Jawahar Reddy సెలవుపై వెళ్లడంతో.. కొత్త సీఎస్ నియమితులయ్యారు. new CS నియామకం కారణంగా Jawahar Reddy బదిలీ అయ్యారు. బుధవారం ఉదయం TDP జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును నిరబ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి వచ్చారు.
ఈ నెల 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. CMOలో కొత్త బృందం కోసం పని కొనసాగుతోంది. సీఎం ప్రధాన కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రకు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఆయన గతంలో ఆర్థిక శాఖలో పనిచేశారు. Sai Prasad ను CMO గా కూడా చేర్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ప్రమాణస్వీకారానికి ముందే నియామకాలు పూర్తవుతాయి.