అమరావతి: విద్యా ర్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని నవంబరులో నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతుంది.. నవంబరు లో తల్లిదండ్రుల – ఉపాధ్యాయుల సమావేశం .. మంత్రి లోకేష్.
అక్టోబరు, నవంబరు, డిసెం బరు నెలల్లో సైన్స్ ఫేర్, క్రీడా పోటీలు నిర్వహించాలని, విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంపొందించేందుకు అవ సరమైన కిట్లు అందించాలని సూచించారు. పాఠశాల విద్యపై శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. “పాఠశాలల్లో ఏ స్థాయిలో ప్రశ్న పత్రాలు లీకైనా కఠిన చర్యలు తీసుకుంటాం. బడుల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతోంది.
అనకాపల్లి అనాధ ఆశ్రమంలో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వాటిల్లో నిరంతరం తనిఖీలు చేపట్టాలి. పాఠశాలల్లో ఆయాలు, రాత్రి కాప లాదారులకు పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలి” అని లోకేశ్ ఆదేశించారు.
Related News
యువతకు ఉపాధి కల్పించేందుకే నైపుణ్య గణన నిర్వహిస్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. ఉన్నత విద్య, నైపుణ్య గణనపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘పరిశ్రమల యజమా నులు, జాబ్ పోర్టల్స్ నిర్వాహకులతో మాట్లాడి మెరు గైన నైపుణ్య గణనకు సలహాలు తీసుకోవాలి.
నైపుణ్య గణన తర్వాత యువతకు నైపుణ్యాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. సర్వే ద్వారా వివరాలతో యువత విద్యార్హతలు, ఉపాధి, నైపుణ్యాలను క్రోడికరించి ప్రభు త్వమే ఒక ప్రత్యేక రెస్యూమ్ తయారుచేస్తుంది. ఈ సమాచారాన్ని ప్రముఖ కంపెనీలు నేరుగా చూసేందుకు అవకాశం కల్పిస్తాం. దీంతో కంపెనీలకు అవసరమైన నైపుణ్యమున్న యువతను నేరుగా ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి వస్తుంది. పూర్తిస్థాయి ప్రణా ళిక సిద్ధమయ్యాక మంగళగిరిలో ప్రయోగాత్మకంగా గణన చేపట్టాలి అని చెప్పారు. యూనివర్సిటీ లో ఖాలీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని లోకేష్ ఆదేశించారు