జూలై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌.. కారణం ఇదే !

జూలై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.పేపర్ లీకేజీకి నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ మేరకు విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్‌కు సహకరించాలని విద్యార్థి సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. నీట్, నెట్ పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

పరీక్షల నిర్వహణలో విఫలమైన ఎన్టీఏను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. ఈ డిమాండ్లతో జూలై 4న బంద్‌కు పిలుపునిచ్చారు. మరోవైపు నీట్‌ అక్రమాలకు నిరసనగా విద్యార్థి సంఘాలు మంగళవారం పార్లమెంట్‌ మార్చ్‌ చేపట్టనున్నాయి. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరవధిక నిరసన ఆరు రోజులుగా కొనసాగుతోంది. కాగా..

నీట్-యూజీలో ఓఎంఆర్ షీట్ అవకతవకల ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం కేసును రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ పరీక్ష రాసిన ఓ విద్యార్థి ఈ పిటిషన్‌ దాఖలు చేశాడు. పిటిషనర్ రాసిన ఓఎంఆర్ షీట్ మార్చారని పిటిషనర్ తరపు న్యాయవాది ఆరోపించారు. దీనిపై వెకేషన్‌ బెంచ్‌ స్పందిస్తూ.. జూన్‌ 23న జరిగే పునఃపరీక్షకు హాజరు కావడానికి పిటిషనర్‌ అనుమతి కోరగా.. పరీక్ష ముగిసిందని ఆమె తెలిపారు. రెండు వారాల తర్వాత విచారణ జరపాలని ఎన్టీఏ తరపు న్యాయవాది కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.