AP Teacher Transfers Amaravati: ఏపీ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం టీచర్ల బదిలీలపై నారా లోకేష్ మాట్లాడుతూ.. టీచర్ల బదిలీలు పారదర్శకంగా జరగాలి.
పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఇటీవల నిర్వహించిన సమీక్షలో AP Education, IT and Electronics Minister Nara Lokesh ఈ విషయాన్ని అధికారులకు సూచించారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సాయంత్రం నారా లోకేష్ సుమారు 3 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
రాజకీయ ఒత్తిళ్లు లేకుండా విధివిధానాలు
Related News
ఏపీ ఉపాధ్యాయుల బదిలీల విషయంలో గతంలో మాదిరిగా రాజకీయ ఒత్తిళ్లు లేకుండా విధివిధానాలు రూపొందించాలని మంత్రి లోకేశ్ కమిషనర్ ను ఆదేశించారు. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. Teachers non-teaching పనులు, అనవసర యాప్ ల భారాన్ని తగ్గించుకుని పూర్తిస్థాయిలో బోధనపై దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో పేరెంట్స్ కమిటీలు భాగస్వాములు కావాలి.
మూసివేసిన పాఠశాలల పూర్తి వివరాలను తదుపరి సమీక్షలో సమర్పించాలి. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు ఎన్ని నిధులు అవసరమో వాటిని సమకూర్చాలి. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రయివేటు పాఠశాలలకు విద్యార్థులు బదిలీ కావడానికి గల కారణాలపై సమగ్ర నివేదిక అందించాలి. దీంతో పాటు పిల్లల అభ్యసన ఫలితాలు, విద్యా ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో లోకేష్ చర్చించారు.
ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని మంత్రి లోకేష్ కోరారు
దేశంలో ఎక్కడెక్కడ అత్యుత్తమ విద్యావిధానాలు అమలవుతున్నాయో అధ్యయనం చేసి నివేదిక అందజేయాలని మంత్రి లోకేశ్ అధికారులను కోరారు. సమీక్షలో భాగంగా జర్మనీ, ఆస్ట్రియా తదితర అభివృద్ధి చెందిన దేశాల్లోని విద్యావ్యవస్థల గురించి తెలుసుకోవాలని నారా లోకేష్ ప్రస్తావించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంపై దృష్టి సారించాలని, ఏ ప్రాంతంలో పాఠశాలల కొరత ఉందో పరిశీలించి కొత్త పాఠశాలలు ప్రారంభించేలా నివేదిక ఇవ్వాలన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్, వయోజన విద్యాశాఖ డైరెక్టర్ నిధిమీనా, సమగ్ర విద్యాశాఖ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.