సెల్ టవర్లు లేకుండానే మొబైల్ కమ్యూనికేషన్స్.

మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో ‘శాటిలైట్’ కనెక్టివిటీని సాధించడంలో చైనా శాస్త్రవేత్తలు విజయం సాధించారు. సెల్ టవర్లు లేకుండా ఫోన్లలో మాట్లాడవచ్చని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

చైనా ప్రయోగించిన ‘టియాంటాంగ్-1’ సిరీస్ ఉపగ్రహాల సంఖ్య మూడుకు చేరింది. ఇది ఆసియా-పసిఫిక్ ప్రాంతం అంతటా మొబైల్ ఉపగ్రహ కనెక్టివిటీకి మార్గం సుగమం చేసింది. భూకంపాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ‘శాటిలైట్ కనెక్టివిటీ’ కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, శాటిలైట్ కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే స్మార్ట్‌ఫోన్‌లను తీసుకువచ్చిన ప్రపంచంలోనే మొదటి కంపెనీగా Huawei ఇప్పటికే గుర్తింపు పొందింది. షియోమీ, హానర్, ఒప్పో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తాజాగా ఈ జాబితాలో చేరాయి.