ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలు అడియాసలు కానున్నాయి. నిన్న మొన్నటి వరకుMEGA DSC అంటూ అక్కడక్కడా అంటూ అందరూ ఇప్పుడు సందడి చేయకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. నవంబర్ 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అయితే సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది.
అయితే దీనిపై విద్యాశాఖ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు టెట్ ఫలితాలు వెలువడిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించిన ప్రభుత్వం.. నోటిఫికేషన్ విడుదల తేదీపై స్పష్టత ఇవ్వకపోవడంతో నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతోంది. ఇప్పటికే టెట్ పాసైన అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, చిరుద్యోగులు సైతం తమ ఉద్యోగాలను వదులుకుని ప్రభుత్వ ఉపాధ్యాయులు కావాలనే తపనతో గత కొన్ని నెలలుగా సిద్ధమవుతున్నారు. మొత్తం 16,317 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టనున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు గురుకుల, ఆదర్శ పాఠశాలలు, బీసీ, గిరిజన పాఠశాలల్లో 2,281 ఖాళీలు ఉన్నాయి.
Related News
ఇప్పటి వరకు నోటిఫికేషన్ జారీపై స్పష్టత రాకపోవడంతో.. తక్షణమే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మెగా డీఎస్సీ వాయిదాకు SC రిజర్వేషన్లే కారణమని అధికారులు చెబుతున్నారు.
వయోపరిమితిలో సడలింపు, రిజర్వేషన్లపై స్పష్టత వచ్చిన తర్వాతే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్ష కూడా వాయిదా పడింది. డీఎస్సీ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ 10న జరగాల్సిన స్క్రీనింగ్ పరీక్ష వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పరీక్షను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ప్రకటించింది. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామని ప్రకటనలో తెలిపారు.
మరో వైపు ఈ రోజు తాజా గా SC వర్గీకరణ అయ్యాక DSC నోటిఫికేషన్ ఉంటుంది అంటూ వార్తలు వచ్చాయి.. దీని ప్రకారం అసలు నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అయ్యేది ఇవరికి అర్ధం కాకుండా ఉంది..