దేశంలో రోడ్లపై అన్ని రకాల వాహనాలు నడుస్తాయి. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్, నాన్-ఎలక్ట్రిక్, ప్రైవేట్, ప్యాసింజర్, కమర్షియల్ వాహనాలు ఉన్నాయి. అయితే, వివిధ రకాల వాహనాలపై కూడా నంబర్ ప్లేట్లు వేర్వేరుగా ఉంటాయి. వైట్ నంబర్ ప్లేట్‌లను కలిగి ఉండే సాధారణ వ్యక్తులతో కూడిన వాహనాలను మనం తరచుగా చూసే ఉంటాం. అయితే ఇది కాకుండా.. వివిధ నంబర్ ప్లేట్‌లను కలిగి ఉన్న ఇతర రకాల వాహనాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏ కేటగిరీ వాహనానికి ఏ నంబర్ ప్లేట్ ఉంటుందో మనం ఇపుడు చూద్దాం.
వైట్ నంబర్ ప్లేట్
వైట్ నెంబర్ ప్లేట్ పై బ్లాక్ కలర్ అక్షరాలు, సంఖ్యలు రాసి ఉంటె.. అవి ప్రైవేట్ వాహనాలు అని అర్థం. అయితే, ఈ వాహనాలను వాణిజ్య అవసరాలకు వినియోగించరాదు. ఈ నంబర్ ప్లేట్ సామాన్యుల కోసం జారీ చేయబడింది.
ఎల్లో నంబర్ ప్లేట్
ఎల్లో ప్లేట్ పై బ్లాక్ కలర్ అక్షరాలు, సంఖ్యలు రాసి ఉంటె.. ఆ వాహనాలు వాణిజ్య అవసరకు అని అర్థం. ఇందులో టాక్సీ, ట్రక్, ఆటో వంటి ఆటో ఉత్పత్తులను ఉపయోగిస్తారు.
గ్రీన్ నంబర్ ప్లేట్
గ్రీన్ నంబర్ ప్లేట్‌పై వైట్ కలర్ ఇంక్‌తో అక్షరాలు రాసి ఉంటెయ్ అది ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనం అని అర్థం. ఇది పర్సనల్ గా యూజ్ చేసుకుంటారు.
ఎల్లో లెటర్స్ తో గ్రీన్ ప్లేట్
గ్రీన్ ప్లేట్ పై ఎల్లో లెటర్స్ రాసి ఉంటె అవి వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాలకు అని అర్థం. ఇవి ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాలకు భిన్నంగా ఉంటాయి.
రెడ్ నంబర్ ప్లేట్
రెడ్ ప్లేట్ లో వైట్ లిట్టర్స్ రాసి ఉంటె.. అది తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాల కోసం అని అర్థం. వాహనం శాశ్వత నంబర్ ప్లేట్ పొందనప్పుడు ఇది ఉపయోగించబడుతుంది.
బ్లు నంబర్ ప్లేట్
ఈ సంఖ్యలు బ్లూ ప్లేట్ పై వైట్ లెటర్స్ తో రాసి ఉంటె.. ఇది విదేశీ దౌత్యవేత్తలు ఉపయోగించే వాహనాలు అని అర్థం.