Maternity Leave update: మెటర్నిటీ సెలవు (180 రోజులు) ఇద్దరు పిల్లలకే అనే నిబంధన తొలగింపు

కూటమి ప్రభుత్వం మహిళా ఉద్యోగులకి శుభవార్త చెప్పింది.. ఇప్పటి వరకుక్ ఉన్న మెటర్నిటీ సెలవు ఇద్దరు పిల్లలకే అనే నిబంధన తొలగింపు ఇప్పడు సవరించిన ఉత్తర్వుల ప్రకారం ఎంత మంది పిల్లలకి అయినా ఈ సెలవు వాడుకోవచ్చు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రధాన మార్పులు

  1. మెటర్నిటీ సెలవు ఇద్దరు పిల్లలకే అనే నిబంధన తొలగింపు ఇప్పడు సవరించిన ఉత్తర్వుల ప్రకారం ఎంత మంది పిల్లలకి అయినా ఈ సెలవు వాడుకోవచ్చు..
  2. తక్షణ అమలు– ఈ సవరణ వెంటనే అమలులోకి వస్తుంది. ప్రస్తుతం మాతృ సెలవులో ఉన్న లేదా ఇటీవల ప్రసవించిన ఉద్యోగులు కూడా ఈ ప్రయోజనాన్ని పొందగలరు.

నిర్ణయం యొక్క ప్రయోజనాలు

  • ప్రసూతి ఆరోగ్యం: ఎక్కువ సెలవు కాలం వల్ల తల్లులుపూర్తిగా కోలుకోవడానికి సమయం లభిస్తుంది.
  • పిల్లల సంరక్షణ: పుట్టిన పిల్లలకుమొదటి 6 నెలలు అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో తల్లి దగ్గర ఉండటం పిల్లల ఆరోగ్యానికి మంచిది.
  • పనిజీవిత సమతుల్యత: ఉద్యోగస్తులైన తల్లులుతమ కుటుంబం మరియు ఉద్యోగాన్ని సమతుల్యంగా నిర్వహించుకోవచ్చు.

సామాజిక ప్రతిస్పందన

ఈ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు, మహిళా హక్కుల సంస్థలు సంతోషంగా స్వాగతించాయి. ఇది ప్రజా రంగంలో మహిళలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన అడుగు.

ఈ సంస్కరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రగతిశీల ఆలోచనకు నిదర్శనం. ఇది తల్లులు మరియు పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి, ఉద్యోగస్తులు సంతోషంగా పనిచేయడానికి దోహదపడుతుంది. ఇలాంటి మరిన్ని సానుకూల మార్పులు రాష్ట్రంలో అమలు కావాలని కోరుకుంటున్నాము.

తల్లి ఆరోగ్యంసమాజ ఆరోగ్యం!”