LIC scheme: కొత్త లాభాల స్కీం.. నాలుగు సంవత్సరాల్లో రూ.1 కోటి వచ్చే LIC ప్లాన్…

మీరు నాలుగు సంవత్సరాలకే రూ.1 కోటి సంపాదించాలి అనుకుంటున్నారా? ఇది అసాధ్యంగా అనిపించినా, LIC అందించుతోన్న ‘జీవన్ శిరోమణి’ స్కీమ్‌తో ఇది సాధ్యం కావచ్చు. ఇది ఒక బీమా పాలసీ మాత్రమే కాదు, భవిష్యత్తుకు భరోసా ఇచ్చే మంచి పెట్టుబడి ప్లాన్. మధ్య తరగతి, పై తరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని LIC ఈ ప్లాన్‌ను రూపొందించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మూడు లక్షణాలు – బీమా, రాబడి, లోన్ సౌకర్యం

ఈ పాలసీలో బీమా కవరేజ్‌తో పాటు, ప్రీమియం చెల్లించిన తర్వాత కొన్ని సంవత్సరాల్లో మనీబ్యాక్ లాభాలు లభిస్తాయి. అంతేకాదు, అవసరమైనప్పుడు లోన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్‌తో మీ డబ్బు సురక్షితంగా ఉండడమే కాదు, అవసరమైన సమయంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది.

ప్రీమియం నాలుగేళ్లు చెల్లిస్తే సరిపోతుంది

ఈ పాలసీలో మీరు కేవలం నాలుగు సంవత్సరాలపాటు ప్రీమియం చెల్లిస్తే చాలు. అయితే ఇది హై-ఎండ్ పాలసీ కావడంతో ప్రీమియం కొంచెం ఎక్కువే. ఉదాహరణకి మీరు రూ.1 కోటి గరిష్ఠ మొత్తం పొందాలంటే, నెలకు సుమారు రూ.94,000 చెల్లించాలి. మీరు నెలవారీ, మూడు నెలలకోసారి, అరవెళ్లలోకోసారి లేదా ఏడాదికి ఒకసారి ఇలా మీకు సౌకర్యంగా ఉన్న విధంగా చెల్లించవచ్చు.

Related News

పాలసీకి అర్హత వయస్సు ఎంత?

ఈ పాలసీని తీసుకోవాలంటే కనీసం 18 ఏళ్లు వయస్సు ఉండాలి. మీరు ఎంచుకునే పాలసీ కాలానికి ఆధారంగా గరిష్ఠ వయస్సు పరిమితి ఉంటుంది. ఉదాహరణకి: 14 సంవత్సరాల పాలసీకి గరిష్ఠ వయస్సు 55 ఏళ్లు. 16 సంవత్సరాల పాలసీకి 51 ఏళ్లు. 18 సంవత్సరాల పాలసీకి 48 ఏళ్లు. 20 సంవత్సరాల పాలసీకి 45 ఏళ్లు. పాలసీ మధ్యలోనే డబ్బు తిరిగి వస్తుంది

మనీబ్యాక్ ఫీచర్ కూడా

పాలసీ మద్యలో కొంత శాతం డబ్బు తిరిగి వస్తుంది. ఉదాహరణకి: 14 ఏళ్ల పాలసీలో 10వ, 12వ సంవత్సరాల్లో 30% డబ్బు తిరిగి వస్తుంది. 16 ఏళ్ల పాలసీలో 12వ, 14వ సంవత్సరాల్లో 35%. 18 ఏళ్ల పాలసీలో 14వ, 16వ సంవత్సరాల్లో 40%. 20 ఏళ్ల పాలసీలో 16వ, 18వ సంవత్సరాల్లో 45%. పాలసీ పూర్తి అయినప్పుడు మిగిలిన డబ్బు బోనస్‌తో పాటు మొత్తం లభిస్తుంది.

లోన్ తీసుకునే అవకాశం

ఈ పాలసీ కొనుగోలు చేసిన తర్వాత ఏడాది పూర్తయ్యాక లోన్ తీసుకోవచ్చు. మీరు కనీసం ఒక సంవత్సరానికి సంబంధించిన ప్రీమియమ్‌లు చెల్లించి ఉండాలి. తీసుకునే లోన్ మొత్తం పాలసీ విలువను బట్టి LIC నిర్ణయిస్తుంది.

పన్ను మినహాయింపు కూడా ఉంది

ఈ పాలసీపై మీరు చెల్లించే ప్రీమియం మొత్తంపై ఆదాయపు పన్ను చట్టంలోని 80C కింద మినహాయింపు పొందవచ్చు. పాలసీ పూర్తయ్యాక వచ్చే మొత్తంపై కూడా పన్ను మినహాయింపు లభిస్తుంది. అంటే ఇది టాక్స్-ఫ్రీ రాబడి అవుతుంది.

జీవన్ శిరోమణి – మీ భవిష్యత్తుకు బలమైన పెట్టుబడి

మీ లక్ష్యం పెద్దదైతే, జీవన్ శిరోమణి మీకు సరైన దారిగా నిలవవచ్చు. నాలుగు సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించి, జీవితాంతం ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం LIC అధికారిక వెబ్‌సైట్ లేదా దగ్గరLIC బ్రాంచ్‌ను సంప్రదించండి.