SBI క్రెడిట్ కార్డు హోల్డర్లకు కీలక మార్పులు
SBI క్రెడిట్ కార్డు వినియోగదారులకు రివార్డ్ పాయింట్లు తగ్గే అవకాశం ఉంది. Swiggy వంటి ఫుడ్ డెలివరీ సేవలపై ప్రస్తుతం 10X రివార్డ్ పాయింట్లు అందించగా, ఇప్పుడు 5X కి తగ్గించనున్నారు. Air India Platinum క్రెడిట్ కార్డు ద్వారా ఇప్పటివరకు ₹100 ఖర్చు పై 15 పాయింట్లు వచ్చేవి, ఇకపై 5 పాయింట్లు మాత్రమే అందనున్నాయి.
Signature క్రెడిట్ కార్డు ద్వారా 30 పాయింట్లు వస్తే, ఇకపై 10 పాయింట్లకు తగ్గించే అవకాశం ఉంది.
IDFC First Bank – Club Vistara కార్డు రద్దు?
IDFC First Bank ప్రస్తుతం Club Vistara క్రెడిట్ కార్డు ద్వారా Maharaja Points అందిస్తోంది. అయితే ఈ కార్డు ఏప్రిల్ 1, 2025 తర్వాత అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి 31, 2025 వరకు మాత్రమే ఈ కార్డు లభించే అవకాశం ఉంది.
Axis Bank – Maharaja Club మెంబర్‌షిప్ కట్?.
Axis Bank Vistara క్రెడిట్ కార్డు వినియోగదారుల కోసం ఏప్రిల్ 18, 2025 నుంచి రివార్డ్స్ విధానంలో మార్పులు చేయనున్నట్లు సమాచారం. కార్డు రిన్యువల్ చేసుకునే వారికి ఇకపై ఏటా ఫీజు ఉండదని సమాచారం. అయితే, Maharaja Club మెంబర్‌షిప్‌ను రద్దు చేసే అవకాశముంది. అయితే, ఇవన్నీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో బ్యాంకులు దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
క్రెడిట్ కార్డు ఉపయోగాలు ఏమిటి?
క్రెడిట్ కార్డు వాడినప్పుడు, మీరు ఖర్చు చేసిన మొత్తం తర్వాతి నెలలో కట్టాల్సి ఉంటుంది. ఖర్చు చేసిన ప్రతి రూపాయికి రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు లభిస్తాయి. సమయానికి బిల్లు చెల్లిస్తే, మీ CIBIL స్కోర్ మెరుగవుతుంది. అత్యవసర సమయాల్లో డబ్బు లేకపోయినా క్రెడిట్ కార్డు ద్వారా తక్షణ చెల్లింపులు చేయొచ్చు.
మీ దగ్గర SBI, IDFC First, లేదా Axis Bank క్రెడిట్ కార్డు ఉంటే, ఈ మార్పులు మీపై ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకోండి. మీరు గెలుచుకునే రివార్డ్స్ తగ్గిపోకముందే సరైన నిర్ణయం తీసుకోండి.