మీ పిల్లల కోసం LIC న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ.

ఇటీవల, ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ప్రజలకు మరిన్ని ప్రయోజనాలను అందించడానికి కొత్త బీమా పథకాలను ప్రవేశపెడుతోంది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, LIC న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్‌ను రూపొందించింది. పిల్లల తల్లిదండ్రులు లేదా తాతామామలు ఈ పాలసీని పిల్లల పేరు మీద తీసుకునే సౌకర్యం ఉంది. రూ. లక్ష బీమా మొత్తంతో, 0 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు రూ. 4327 ప్రీమియం చెల్లించాలి. 5,10,15 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రీమియం మారుతుంది. మెచ్యూరిటీ వయస్సు 25 సంవత్సరాలు. మీ పిల్లలు 18,20,22 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, మీకు 20% డబ్బు తిరిగి లభిస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now