Xiaomi Pad 7 Ultra: చైనాలో భారీ సర్ప్రైజ్… కొత్త Xring O1 చిప్‌తో Xiaomi కొత్త చరిత్ర రాయబోతుంది…

Xiaomi ఈసారి మామూలుగా లేదండీ…  చైనాలో ఒక భారీ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో రెండు సూపర్ ప్రోడక్ట్స్ మీదే అందరి దృష్టి ఉంది. అవే Xiaomi 15S Pro మరియు Xiaomi Pad 7 Ultra. ఈ రెండూ Xiaomi కొత్తగా తయారుచేసిన Xring O1 చిప్‌తో వచ్చేసాయి. ఇది Xiaomiకి ఓ బ్రాండ్ న్యూ టెక్నాలజీ. మొదటిసారి తామే తయారు చేసిన 3nm ప్రాసెసర్‌ తో Xiaomi ఈ గేమ్‌ను పూర్తిగా మార్చబోతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Xiaomi 15S Pro: కొత్త చిప్‌తో పవర్‌ఫుల్ ఫోన్

Xiaomi 15S Pro అనేది Xiaomi నుంచి వచ్చిన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్. ఇందులో కొత్త Xring O1 చిప్ వాడటం చాలా స్పెషల్. ఈ ఫోన్ డిజైన్ గతంలో వచ్చిన Xiaomi 15 Proలా ఉండొచ్చు. కానీ ఫీచర్లలో మాత్రం పెద్ద మార్పులు ఉన్నాయి. ఇందులో 6.73 అంగుళాల 2K LTPO స్క్రీన్ ఉంటుంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz ఉంటుంది. అంటే స్క్రోల్ చేస్తుంటే చాలా స్మూత్ అనిపిస్తుంది.

ఈ ఫోన్‌లో ultrasonic fingerprint sensor ఉండబోతుంది. స్క్రీన్ మీదే ఫింగర్ ప్రింట్ సెన్సార్ పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 6100mAh బ్యాటరీ ఉంటుంది. ఇది పెద్దదే కాబట్టి ఎక్కువ టైమ్ వర్క్ చేస్తుంది. అలాగే ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కి, 50W వైర్లెస్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా విషయంలో ఈ ఫోన్ స్పెషల్. Leica బ్రాండెడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మొత్తం మూడూ 50MP కెమెరాలే. వీటిలో ఒకటి 10x పిరిస్కోప్ జూమ్ కెమెరా. అంటే చాలా దూరం నుంచి కూడా క్లియర్‌గా ఫొటోలు తీసుకోవచ్చు. ఇంకా, ఈ ఫోన్ UWB (Ultra Wide Band) సపోర్ట్‌తో రాబోతోంది. దీని వలన Xiaomi కార్లు అయిన SU7 లేదా YU7తో ఈ ఫోన్ డైరెక్ట్‌గా కనెక్ట్ అవుతుంది.

Xiaomi Pad 7 Ultra: టాబ్లెట్‌ అనిపించని టాబ్లెట్

Xiaomi మరో భారీ సర్ప్రైజ్‌గా Xiaomi Pad 7 Ultra టాబ్లెట్‌ను కూడా ఈవెంట్‌లో లాంచ్ చేసింది. ఇది వింటే మీరు షాక్ అవుతారు. 14 అంగుళాల OLED స్క్రీన్‌తో వస్తోంది. ఈ స్క్రీన్ చాలా పెద్దది, కానీ బెజల్స్ చాలా సన్నగా ఉంటాయి. స్క్రీన్‌ టాప్‌లో చిన్న నాచ్ ఉంటుంది. దాంతో 3D ఫేస్ రికగ్నిషన్ కూడా ఉండొచ్చని టిప్స్ వచ్చాయి.

ఈ టాబ్లెట్ కూడా కొత్త Xring O1 చిప్‌తో వస్తోంది. అంటే స్క్రీన్ పెద్దది, ప్రాసెసర్ పవర్‌ఫుల్ గా ఉంటుంది. పనిలో వేగం, గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి వాటికి ఇది బెస్ట్. ఇందులో 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అంటే మీ టాబ్లెట్ మినిమమ్ టైమ్‌లో మ్యాక్స్ ఛార్జ్ అవుతుంది.

ఈ Pad 7 Ultraను వర్క్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకొస్తున్నారు. పెద్ద స్క్రీన్ కావడంతో వీడియోలు చూడడానికైనా, వర్క్ డాక్యుమెంట్స్ చూసేందుకైనా ఇది బెస్ట్. ఇది ప్రీమియం టాబ్లెట్‌ మార్కెట్‌లో Xiaomi కొత్త ఒరవడి స్టార్ట్ చేయబోతోంది.

Xring O1 చిప్: Xiaomiకే చెందిన సొంత ప్రాసెసర్

Xring O1 అనేది Xiaomi తయారు చేసిన మొట్టమొదటి సొంత చిప్. ఇది 3nm టెక్నాలజీతో వస్తోంది. అంటే ఇప్పటివరకు మార్కెట్‌లో చాలా తక్కువ కంపెనీలే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడగలిగాయి. కానీ Xiaomi మాత్రం ముందుగా అడుగు వేసింది. Xiaomi CEO లే జూన్ చెబుతున్నట్టే, ఈ చిప్ ఇప్పటికే మాస్ ప్రొడక్షన్‌లోకి వచ్చింది. దీన్ని తాయారుచేయడానికి Xiaomi దాదాపు 13 బిలియన్ యువాన్ ఖర్చు పెట్టింది. అంటే దాదాపు 1.8 బిలియన్ అమెరికన్ డాలర్ల వరకూ ఖర్చు చేసారు.

ఈ చిప్‌ వలన Xiaomi ప్రొడక్ట్స్‌కు సూపర్ స్పీడ్, అద్భుతమైన బ్యాటరీ మేనేజ్‌మెంట్, హీట్ తక్కువగా ఉండేలా టెక్నాలజీ అందుతుంది. ఇది మామూలు విషయం కాదు. మార్కెట్‌లో చాలామంది ఇప్పుడు Xiaomi కొత్త ప్రాసెసర్ మీదే చర్చిస్తున్నారు.

ఈవెంట్‌ను మిస్ అయ్యారా

ఇప్పుడు మీరు గమనించాలి – Xiaomi రిలీజ్ చేసిన ఈ రెండు డివైస్‌లు అంటే Xiaomi 15S Pro మరియు Xiaomi Pad 7 Ultra గేమ్ ఛేంజర్లు. కొత్త చిప్, పవర్‌ఫుల్ ఫీచర్లు, ప్రీమియం డిజైన్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ – ఇవన్నీ కలిపితే ఈవెంట్‌ను మిస్ చేయడం అనేది తెలివితక్కువ పని.

మీరు కూడా టెక్నాలజీ లవర్ అయితే లేదా Xiaomi ఫ్యాన్ అయితే  Xiaomi ఈవెంట్‌లో రిలీజ్ చేసిన డివైస్  గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది Xiaomi కొత్త యుగానికి తొలి అడుగు…