వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో డబ్బు అవసరం కావచ్చు. ఆరోగ్య సంబంధిత అత్యవసరాలు, గృహ పునరుద్ధరణ, పిల్లల విద్యాభ్యాసం వంటి అవసరాల కోసం సీనియర్ సిటిజన్లు రుణాలు తీసుకోవాలని ఆలోచించవచ్చు. అయితే, రిటైర్మెంట్ తరువాత సీనియర్ సిటిజన్లకు బ్యాంకుల నుండి రుణాలు పొందడం కొంచెం కష్టమయ్యే విషయం. పరిమిత ఆదాయ వనరుల కారణంగా, బ్యాంకులు జాగ్రత్తగా ఉంటాయి. అయితే, నేటి రోజుల్లో అనేక బ్యాంకులు మరియు బ్యాంకింగేతర సంస్థలు సీనియర్ సిటిజన్లకు ఈజీగా రుణాలు అందిస్తున్నాయి.
పర్సనల్ లోన్
సీనియర్ సిటిజన్లకు అత్యవసరంగా నగదు అవసరం ఉన్నప్పుడు పర్సనల్ లోన్ ఒక మంచి ఆప్షన్. ఇది సులభంగా పొందవచ్చు మరియు దీనికి ఎటువంటి పూచీకత్తు అవసరం ఉండదు. చాలా బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు పెన్షన్ లేదా పెట్టుబడి ఆదాయంపై ఆధారపడి పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి.
పెన్షన్ లోన్
ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లూ న్స్ అందుబాటులో ఉంటాయి. ఈ రుణం, నెలవారీ పెన్షన్ ఆధారంగా, సీనియర్ సిటిజన్లకు ఇస్తారు. ఇందులో వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి మరియు రుణం మంజూరు అయ్యాక, ప్రతి నెలా పెన్షన్ ఖాతా నుండి చెల్లింపులు జరుగుతాయి. పెన్షన్ లోన్ల కాలవ్యవధి మూడు నుంచి ఏడు సంవత్సరాలు ఉంటుంది.
Related News
రివర్స్ మార్టగేజ్ లోన్
వృద్ధాప్యంలో ఉన్న సీనియర్ సిటిజన్లకు రివర్స్ మార్టగేజ్ ఒక మంచి ఆప్షన్. సీనియర్ సిటిజన్లు తమ సొంత ఇంటిని రుణంగా పెట్టి బ్యాంకుల నుండి సకాలంలో ఆదాయం పొందవచ్చు. అయితే, వారు మరణిస్తే, బ్యాంకులు ఆ ఇంటిని అమ్మి రుణాన్ని తీర్చుకుంటాయి. ఈ లోన్ ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లకు అవసరమయ్యే ఆదాయం రాబడడానికి సహాయపడుతుంది.
బంగారు రుణాలు
బంగారాన్ని రుణంగా పెట్టి, సీనియర్ సిటిజన్లు తక్కువ వడ్డీ రేట్లతో గోల్డ్ లోన్ పొందవచ్చు. బంగారం యొక్క మార్కెట్ విలువ ఆధారంగా రుణం అందిస్తుంది. దీన్ని తీసుకోవడానికి ప్రామాణిక డాక్యుమెంటేషన్ అవసరం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఈ రుణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
లోన్ అప్రూవల్ కోసం చిట్కాలు
క్రెడిట్ స్కోరు 750 కంటే ఎక్కువ ఉంటే, లోన్ అప్రూవల్ అవకాశాలు పెరుగుతాయి. రుణ అర్హత కలిగిన వ్యక్తిని సహ దరఖాస్తుదారుగా చేర్చడం, స్థిరమైన ఆదాయ వనరులను చూపించడం వంటి చిట్కాలు ఉండటం వల్ల, రుణం పొందడం సులభం అవుతుంది.