EPF, EPS అంటే ఏమిటి?
EPF అనేది ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ కోసం పొదుపు చేసే ప్రభుత్వ పథకం. ఇందులో ప్రతి నెలా ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తాన్ని EPF ఖాతాలో జమ చేస్తారు. అదే విధంగా, ఉద్యోగదారు కూడా అదే మొత్తాన్ని EPFO (Employees Provident Fund Organization) ఖాతాలో జమ చేస్తాడు. ఈ మొత్తానికి 8.25% వడ్డీ లభిస్తుంది. EPS (Employee Pension Scheme) కూడా EPFO పరిధిలో ఉంటుంది. ఇది ఉద్యోగి రిటైర్మెంట్ తరువాత నెలకు నెల పించను అందించే విధంగా రూపొందించారు.
₹20,000 జీతం ఉంటే రిటైర్మెంట్ కు ఎంత దాచుకోగలం?
మీ వయస్సు 25 ఏళ్లు, మీ ప్రాథమిక జీతం (Basic Salary) ₹20,000 ఉంటే రిటైర్మెంట్ (60 ఏళ్లకు) కల్లా EPF లో ఎంత అందుకుంటారు, EPS ద్వారా ఎంత పించను వస్తుందో చూద్దాం.
మీ జీతంలో EPF, EPSకు ఎంత వెళ్తుంది?
మీ EPF కాంట్రిబ్యూషన్: ₹20,000 × 12% = ₹2,400. మీ యజమాని EPF కాంట్రిబ్యూషన్: ₹20,000 × 12% = ₹2,400 (కానీ, ఇది EPF & EPS కి విడిపోతుంది). EPS కి వెళ్లే మొత్తం: ₹15,000 × 8.33% = ₹1,250 (EPS కి గరిష్ట పరిమితి ₹15,000 మాత్రమే) EPF కి వెళ్లే మొత్తం: ₹2,400 – ₹1,250 = ₹1,150.
Related News
EPF ఖాతాలో ఎంత డబ్బు చేరుతుంది?
మీ EPF: ₹2,400, యజమాని EPF: ₹1,150, మొత్తం EPF: ₹3,550 నెలకు. ఏడాదికి: ₹3,550 × 12 = ₹42,600. 35 ఏళ్లకి: ఈ మొత్తం 8.25% వడ్డీతో పెరిగి ₹68.9 లక్షలు అవుతుంది.
EPS ద్వారా రిటైర్మెంట్ తర్వాత ఎంత పించను వస్తుంది?
EPS పించను ఈ ఫార్ములా ప్రకారం లెక్కకడతారు: పించను = (సేవా సంవత్సరాలు × గరిష్ట జీతం) ÷ 70 = (35 × 15,000) ÷ 70 = ₹7,500 నెలకు పించను.
మొత్తం లాభం ఎంత?
EPF ఖాతాలో మొత్తం: ₹68.9 లక్షలు. EPS ద్వారా 20 ఏళ్ల (60-80 ఏళ్లు) వరకు వచ్చే పించను: ₹18 లక్షలు. మొత్తం లాభం: ₹86.9 లక్షలు.
EPF పొదుపు త్వరగా మొదలు పెడితే లాభమే
25 ఏళ్ల వయస్సు నుంచే EPF కాంట్రిబ్యూషన్ మొదలు పెడితే, 35 ఏళ్లలో దాదాపు ₹86.9 లక్షలు చేరవచ్చు. ఈ మొత్తం పూర్తిగా పన్ను మినహాయింపు కలిగినది. జీతం పెరుగుదల & వడ్డీ రేట్లు మారితే, ఇంకా ఎక్కువ పొందే అవకాశం ఉంది.
సాధారణంగా రిటైర్మెంట్ తర్వాత డబ్బు కోసం బాధ పడతారు, కానీ మీరు ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఆర్థికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా జీవించొచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా EPF & EPS పొదుపును ఇప్పుడే ప్రారంభించండి.