Pension: నెలకు రూ.60,000 తెచ్చే అద్భుతమైన ప్లాన్.. కళ్ళు మూసుకుని ఫాలో అవ్వొచ్చు…

భవిష్యత్ కోసం నెలకు కేవలం ₹12,500ను పక్కన పెట్టడం ద్వారా మీరు మీ జీవితం మొత్తం భద్రంగా గడపవచ్చు. మార్కెట్ రిస్క్ లేకుండా, ప్రభుత్వ భరోసాతో, పన్ను మినహాయింపుతో వచ్చే స్కీమ్ ఇది. ఇప్పుడు చెబుతున్నది, ఎవరైనా మొదలు పెట్టగలిగే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకం గురించీ, దానివల్ల వచ్చే లాభాల గురించీ. కొంతమంది చిన్న మొత్తాలతో సాధ్యమా అని భావించవచ్చు, కానీ దీర్ఘకాలం పాటు క్రమంగా చేసిన పొదుపు, ఎప్పటికీ ఆదాయం ఇచ్చే పథకంగా మారుతుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

పదవీ విరమణ తర్వాత ఖర్చులు తగ్గిపోతాయని అందరూ అనుకుంటారు. కానీ నిజంగా చూస్తే ఆరోగ్య ఖర్చులు, దైనందిన అవసరాలు, కుటుంబ బాధ్యతలు ఇంకాస్త ఎక్కువవుతాయి. ఇలాంటి సమయంలో నెలకు స్థిరమైన ఆదాయం అవసరం. ఉద్యోగం లేకపోయినా నమ్మకమైన ఆదాయం వస్తేనే మనం ఆర్థికంగా ఆత్మవిశ్వాసంగా జీవించగలం. అందుకే ఇప్పుడే ప్లాన్ చేస్తే, భవిష్యత్‌లో మిమ్మల్ని మీరు ఆదుకునే స్థాయికి చేరుకోవచ్చు.

ఇక్కడ పీపీఎఫ్ పథకం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకం. దీనిలో పెట్టుబడి పెట్టిన డబ్బుకు ప్రభుత్వం ఒక స్థిరమైన వడ్డీని అందిస్తుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఇది ప్రతి సంవత్సరం కాంపౌండ్ అయ్యే వడ్డీ. అంటే వడ్డీపై మళ్లీ వడ్డీ లభిస్తుంది. దీన్ని పొదుపుదారులకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా చెప్పొచ్చు.

Related News

పీపీఎఫ్ ఖాతాలో సంవత్సరం మొత్తానికి గరిష్టంగా ₹1.5 లక్షలు మాత్రమే డిపాజిట్ చేయొచ్చు. అంటే నెలకు సగటున ₹12,500. ఇదే మీరు 25 సంవత్సరాల పాటు కొనసాగిస్తే, మీరు మొత్తం ₹37,50,000 డిపాజిట్ చేసినవారవుతారు. అయితే, ఈ మొత్తం మీద 7.1% వడ్డీ రేటుతో చూస్తే సుమారుగా ₹65,58,000 వరకు వడ్డీ వస్తుంది. ఈ రెండింటిని కలిపితే, మీ పీపీఎఫ్ ఖాతాలో ₹1.03 కోట్లకు పైగా నిధి ఉంటుంది. ఇది పెద్ద మొత్తమే.

అయితే, చాలా మందికి ఇక్కడే డౌట్ వస్తుంది. ఈ మొత్తాన్ని ఎలా వినియోగించాలి? పూర్తిగా తీసుకోవాలా? లేక వదిలేయాలా? ఇక్కడే ఉంది అసలైన స్మార్ట్ స్ట్రాటజీ. మీరు ఈ మొత్తాన్ని తీసుకోకుండా అదే ఖాతాలో ఉంచితే, అది మీకు జీవితాంతం ఆదాయం ఇచ్చే ఫండ్‌గా మారుతుంది. మీరు ఖాతా పీరియడ్‌ను 15 సంవత్సరాల తర్వాత రెండు సార్లు 5 సంవత్సరాల చొప్పున పొడిగించవచ్చు. అంటే మొత్తం 25 సంవత్సరాల వరకూ ఖాతాను కొనసాగించవచ్చు.

ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఈ ₹1.03 కోట్లు ఖాతాలో ఉంచినట్లయితే, వచ్చే ఏడాది దాని మీద సుమారుగా ₹7,31,000 వడ్డీ వస్తుంది. దీన్ని నెలల వారీగా చూస్తే, నెలకు ₹60,989 లభిస్తుంది. ఇది మీకు నెలకు వస్తున్న రెగ్యులర్ ఆదాయంలా ఉంటుంది. ఈ మొత్తం మీద ఎలాంటి రిస్క్ ఉండదు. మార్కెట్ కదలికలు దీనిపై ప్రభావం చూపవు. పైగా ఇది పన్ను మినహాయింపు ఉన్న ఆదాయం కావడం వల్ల ఇంకా లాభమే.

ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే, మీరు ప్రతి ఏడాది ఒకసారి మాత్రమే వడ్డీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అంటే మీరు ఏడాదికి ఒకసారి మొత్తంగా వడ్డీ తీసుకుని, దాన్ని నెలల వారీగా వినియోగించవచ్చు. మీరు ఇంటి ఖర్చులు, ఆరోగ్య అవసరాలు, ఇతర ప్రయోజనాల కోసం దీన్ని ఉపయోగించవచ్చు. అయితే అసలు పెట్టుబడి మాత్రం అలాగే ఖాతాలో ఉంటుంది. ఇది భద్రంగా, ఎప్పటికీ ఆదాయం ఇచ్చే మూలధనంగా మిగులుతుంది.

పీపీఎఫ్ స్కీమ్ మధ్యతరగతి ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి నెలవారీగా డబ్బు వచ్చి, ఖర్చులు అయిన తర్వాత కూడా కొంతమొత్తం పొదుపుగా మిగలుతుంది. దీనిని సరిగ్గా ప్లాన్ చేస్తే, పదవీ విరమణ సమయంలో అదృష్టాన్ని తీసుకొచ్చే ఫండ్‌గానూ తయారవుతుంది. చాలామందికి ఇది చిన్న విషయం లాగానే అనిపించవచ్చు. కానీ కాలక్రమేణా దీని విలువ ఎంత ఉంటుందో, మీరు తర్వాతే తెలుసుకుంటారు.

ఇక దీన్ని ప్రారంభించడమెలా అంటే, మీరు బ్యాంకుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో పీపీఎఫ్ ఖాతా ప్రారంభించొచ్చు. ఇది ఓపెన్ చేయడానికి KYC డాక్యుమెంట్లు అవసరం. వేరిఫికేషన్ పూర్తయ్యాక మీరు ఆన్‌లైన్‌గానీ, మాన్యువల్‌గానీ మంత్లీ లేదా వార్షికంగా డిపాజిట్ చేయొచ్చు. ఎక్కువమంది నెలవారీ డిపాజిట్‌కు ప్రాధాన్యత ఇస్తారు, ఎందుకంటే చిన్న మొత్తాలతో పొదుపు చేయడం సులభంగా ఉంటుంది.