SIP లో మేజిక్ ఏమిటి?
కేవలం ₹250 పెట్టుబడితోనే SIP ప్రారంభించవచ్చు. మీకు వీలైనప్పుడల్లా పెట్టుబడి పెంచుకోవచ్చు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల డబ్బు రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది. సుదీర్ఘకాలంలో ఇది మిమ్మల్ని కోటీశ్వరులని చేయగలదు.
₹1 కోటి లక్ష్యం.. SIP తో ఎలా సాధ్యం?
SIP లో కాంపౌండింగ్ శక్తి ఉంది. అంటే మీరు వెచ్చించిన డబ్బుకు వచ్చే వడ్డీ కూడా తిరిగి ఇన్వెస్ట్ అవుతుంది. ఇలా వడ్డీ మీద వడ్డీ రావడం వల్ల డబ్బు వేగంగా పెరుగుతుంది. దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెడితే కోటి రూపాయల ఫండ్ మీకు హామీ.
₹2000 SIP చేస్తే ఎంత సమయం పడుతుంది?
ప్రతి నెల ₹2000 పెట్టుబడి పెడితే. 12% రాబడితో 35 ఏళ్లలో ₹1 కోటి మీకు దొరుకుతుంది.ఈ 35 ఏళ్లలో మీరు వెచ్చించేది కేవలం ₹8.4 లక్షలు మాత్రమే. మీ పెట్టుబడి మీద లాభం ₹1,01,81,662
Related News
₹5000 SIP చేస్తే?
ప్రతి నెల ₹5000 ఇన్వెస్ట్ చేస్తే. 12% రాబడితో 30 ఏళ్లలో ₹1 కోటి మీకు వస్తుంది. ఈ కాలంలో మొత్తం పెట్టుబడి ₹18 లక్షలు. కావాల్సిన మొత్తం 5 ఏళ్లు ముందే అందుతుంది.
₹10,000 SIP చేస్తే ఇంకా తక్కువ టైమ్‌లో కోటి రూపాయలు
ప్రతి నెల ₹10,000 SIP చేస్తే. 12% రాబడితో 25 ఏళ్లలోనే ₹1 కోటి మీకు లభిస్తుంది. ఈ 25 ఏళ్లలో మీరు వెచ్చించేది ₹30 లక్షలు మాత్రమే. మీ పెట్టుబడి లాభం ₹1,70,02,066
ఇక ఆలస్యం ఎందుకు? చిన్న మొత్తాలతోనే ప్రారంభించి కోట్ల ఫండ్ తయారు చేసుకోండి. SIP మీ ఫ్యూచర్‌ను సురక్షితంగా, లాభసాటిగా మార్చే శక్తి కలిగిన మార్గం.