TVS EV: కింగ్ లాంటి ఎలక్ట్రిక్ ఆటో… ఒక్కసారి ఛార్జ్ చేస్తే 179 కిలోమీటర్లు పరుగులు..

టీవీఎస్ మోటార్స్ మరోసారి ఆటో రంగంలో సంచలనం సృష్టించబోతోంది. ఇప్పటివరకు టూ వీలర్ల మార్కెట్‌ లోనే దూసుకుపోతున్న ఈ కంపెనీ.. ఇప్పుడు త్రీ వీలర్ సెగ్మెంట్‌లో కూడా తనదైన ముద్ర వేయాలని సిద్ధమవుతోంది. తాజాగా టీవీఎస్ తమ కొత్త ఎలక్ట్రిక్ ఆటోను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పేరు TVS King EV Max. ఇది వాణిజ్య అవసరాలకు, ప్రయాణికుల రవాణాకు చాల అనుకూలంగా తయారైంది. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో ఈ ఆటోకి డిమాండ్ బాగానే పెరగనుందని భావిస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ ఆటో ధర కేవలం రూ. 2.95 లక్షలు మాత్రమే. ఈ ధరలో ఇంత స్టైల్, మైలేజ్, పవర్ ఉన్న ఆటో దొరకడం అరుదైన విషయం. టీవీఎస్ ఈ వాహనాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించింది. ప్రధానంగా డెలివరీ బిజినెస్‌లు, ప్రయాణికుల రవాణా చేసేవాళ్ల కోసం ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.

ఇందులోని ప్రధాన ఆకర్షణ ఎలక్ట్రిక్ బ్యాటరీ వ్యవస్థ. ఇందులో 51.2 వోల్ట్ల లిథియం అయాన్ LFP బ్యాటరీను ఉపయోగించారు. దీని వల్ల వాహనాన్ని బలంగా నడిపించవచ్చు. ఇందులో గరిష్టంగా 11 కిలోవాట్ల శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇది 40 న్యూటన్ మీటర్ టార్క్‌ను కలిగి ఉంటుంది. అంటే తక్కువ లోడ్‌తో కాకుండా, ఎక్కువ బరువు ఉన్నా ఈ ఆటో సాఫీగా నడుస్తుంది.

ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే ఈ ఆటో 179 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇది ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఎక్కువ ఎలక్ట్రిక్ ఆటోలకు మించి మైలేజ్. మరోవైపు, దీన్ని చార్జ్ చేయడానికి టైం కూడా అంత ఎక్కువ కాదు. కేవలం 3.5 గంటల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. అంటే రాత్రి నిద్రించే టైంలో చార్జింగ్ పెడితే.. పొద్దునా పూర్తిగా వాడుకోవచ్చు. మధ్యాహ్నం లేదా సాయంత్రం మళ్లీ చార్జ్ పెట్టినా మిగతా రోజు మొత్తం తిరగవచ్చు.

ఇది కేవలం స్టార్ట్ చేసి నడిపే ఆటో మాత్రమే కాదు.. ఇందులో డ్రైవింగ్ కోసం మూడు మోడ్లు ఇచ్చారు. మొదటిది ఎకో మోడ్. దీనిలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఇది బ్యాటరీ సేవ్ చేయడం కోసం బాగుంటుంది. రెండవది సిటీ మోడ్. దీనిలో గంటకు 50 కిలోమీటర్ల వేగం వస్తుంది. ఇది నగరాల్లో ట్రాఫిక్ ఉన్న చోట్లకి సరిపోతుంది. మూడవది పవర్ మోడ్. దీనితో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. అత్యవసరంగా వేగంగా వెళ్లాల్సిన సమయాల్లో ఇది ఉపయోగపడుతుంది. ఈ ఆటో కేవలం 3.7 సెకన్లలో 30 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. అంటే పికప్ పరంగా కూడా బాగుంది.

ఇందులో స్మార్ట్ ఫీచర్లూ ఉన్నాయి. టీవీఎస్ SmartXonnect అనే బ్లూటూత్ ఆధారిత టెక్నాలజీతో ఈ ఆటో వస్తోంది. దీని ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసి రియల్‌టైమ్ నావిగేషన్, వెహికల్ డయాగ్నోస్టిక్స్, అలర్ట్స్ తదితర సౌకర్యాలు పొందవచ్చు. అంటే ఆటో ఇప్పుడు ఎలా నడుస్తోంది? బ్యాటరీ ఎలా ఉంది? ఏమైనా సమస్య ఉందా? అన్న సమాచారం స్మార్ట్‌ఫోన్‌లోనే తెలుస్తుంది.

ఇంకా ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో LCD డిస్‌ప్లే ఉంటుంది. లైటింగ్ విషయానికి వస్తే LED హెడ్‌ల్యాంప్స్, టెయిల్ లైట్స్ అందించబడినవి. వీటి వల్ల రాత్రిళ్లు ప్రయాణం చేయడంలో ఎక్కువ భద్రత ఉంటుంది. ఆటోకి స్టైలిష్ లుక్ కూడా వస్తుంది.

వాహనానికి కంపెనీ 6 సంవత్సరాల వారంటీ ఇస్తోంది. మొదటి 3 సంవత్సరాల పాటు 24/7 రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా అందిస్తున్నారు. అంటే రోడ్డుపై ఏ సమస్య వచ్చినా కంపెనీ సహాయం కోసం సిద్ధంగా ఉంటుంది. ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్.

ఈ ఆటో వాణిజ్య అవసరాల కోసం చాలా ఉపయోగపడుతుంది. సరుకులు, ఫుడ్ డెలివరీ, లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఇది బెస్ట్ ఆప్షన్. అలాగే ప్రయాణికుల రవాణా చేసే వారికి కూడా ఈ ఆటో పనికొస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో టీవీఎస్ తీసుకొచ్చిన ఈ మోడల్.. ధర, మైలేజ్, స్టైల్, ఫీచర్లు అన్నింటికీ సమతుల్యతగా నిలుస్తుంది.

ఈ ఆటో మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత చిన్న బిజినెస్‌లు, ఆటో డ్రైవర్లు చాలామంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఎలక్ట్రిక్ ఆటో ఒక దారిగా మారుతోంది. ట్రాఫిక్ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందాలనుకునే వారికి ఇది మంచి అవకాశమవుతుంది.

టీవీఎస్ ఎలక్ట్రిక్ ఆటోతో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ మరింత వేగంగా ఎదుగనుంది. వాణిజ్య వాహనాలకు ఇది ఒక కొత్త మెరుగైన దారి చూపనుంది. ఇకపోతే, మీరు కూడా ఆటో డ్రైవింగ్ చేస్తున్నారు లేదా చిన్న వ్యాపారం కోసం ఆటో కొనాలని చూస్తున్నారంటే.. ఈ TVS King EV Max ఒకసారి పరిశీలించాల్సిందే.

ఎందుకంటే.. ఇప్పుడే తీసుకుంటే ధర తగ్గే అవకాశం ఉంది. తర్వాత డిమాండ్ పెరిగినప్పుడు వాహనం లభ్యత కష్టమవుతుంది. పైగా బ్యాంకు లోన్లు, ప్రభుత్వ సబ్సిడీలు లభించేటటువంటి పరిస్థితుల్లో ఈ ఆటో కొనడం మీకు భవిష్యత్తులో లాభాన్నే ఇస్తుంది.

ఇది మరింత తెలివైన నిర్ణయంగా మిగులుతుంది. మీరు కూడా ఓసారి షోరూమ్ వెళ్లి లైవ్‌లో ఈ ఆటో చూడండి.. భలే ఉందిగా అనిపించకపోతే చెప్పండి!