కాంపిటీషన్ తక్కువ ఉన్న జాబ్స్.. నెలకు 50వేల జీతం.. మీరు అర్హులేనా వివరాలు ఇవే

ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదలైనా లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మంచి జీతంతో ప్రభుత్వ ఉద్యోగం ఒత్తిడి లేకుండా ఉంటుంది. అందుకే యువత ప్రభుత్వ ఉద్యోగాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ఉందా? అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ సంస్థలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు పోటీ చాలా తక్కువ. ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 23 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వబడింది. మే 27 మరియు 28 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

ముఖ్యమైన సమాచారం:
ఖాళీల సంఖ్య: 13
శాఖల వారీగా ఖాళీలు:

Related News

  • రీసెర్చ్ అసోసియేట్/ సీనియర్ రీసెర్చ్ ఫెలో: 01
  • IT ప్రొఫెషనల్-III: 01
  • యంగ్ ప్రొఫెషనల్-II: 02
  • యంగ్ ప్రొఫెషనల్-I (IT): 08
  • యంగ్ ప్రొఫెషనల్-I (F&A): 01

అర్హత:
అభ్యర్థులు పోస్టుల ప్రకారం పీజీ, పీహెచ్‌డీ, కంప్యూటర్ సైన్స్, బీకామ్, బీబీఏ, బీబీఎస్ విద్యార్హతలను కలిగి ఉండాలి.

వయో పరిమితి:
పోస్టుల ప్రకారం 21 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు.

ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ మొదలైన వాటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:
పోస్టులను బట్టి 31 వేల నుంచి 54 వేల వరకు అందుకోవచ్చు.

దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్

ఇంటర్వ్యూ తేదీలు:
మే 27, 28.
వేదిక:
ICAR-IASRI, న్యూఢిల్లీ.