Job Mela : జాబ్ మేళా.. నిరుద్యోగులకు శుభవార్త..

నిరుద్యోగ నిర్మూలనకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వాలు అనేక చోట్ల ఉచితంగా ఉపాధి శిక్షణ ఇస్తున్నాయి. ప్రైవేట్ రంగ సంస్థలు కూడా చాలా చోట్ల Job Mela లు నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇప్పటికే చాలా మంది ఈ Job Mela లో పాల్గొని ఎంపికై అనేక కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. అయితే అనేక సంస్థలు ప్రతి ఏటా వివిధ చోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి.

వరంగల్ జిల్లా ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్లో ఈ నెల 11న Job Mela నిర్వహించనున్నారు.

Related News

ఈ మేరకు ఉమ్మడి జిల్లా ఉపాధిహామీ నోడల్ అధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

Hyderabad లోని Apollo Pharmacy లో సుమారు 50 ఉద్యోగాల ఎంపిక కోసం ఈ జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు.

18 నుంచి 35 ఏళ్లలోపు యువతీ, యువకులు దీనికి అర్హులు. D Pharmacy, B Pharmacy, M Pharmacy, Tenth, Inter ఉత్తీర్ణులైన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావాలి.