ఫిబ్రవరి 1 నుంచి ఎండలు మొదలు అంట.. జాగర్త గా ఉండాలి .

జనవరి నెల ముగుస్తుంది . శీతాకాలం కూడా ముగుస్తోంది. ఈ సీజన్‌లో కాస్త చలిగా అనిపించింది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. జనవరి చివరి వారంలో కూడా ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. జనవరి 24 నుంచి 30 వరకు శీతల గాలులు వీస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.ఈ వారం శీతాకాలానికి వీడ్కోలు పలికి శీతాకాలాన్ని ఆస్వాదించండి. ఎందుకంటే ఫిబ్రవరి 1 నుంచి రానున్న రోజుల్లో ఎండలు మండిపోతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఫిబ్రవరి 1 నుంచి ఎండలు స్టార్ట్ అవుతాయి అని.. ప్రారంభం నుంచి 34-35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అంటే ఫిబ్రవరిలోనే వేసవి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎండలు ఎక్కువగా ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాబట్టి చాల జాగర్త గా ఉండండి .