
పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే పొదుపు అలవాటు పెడితే, ఆ అలవాటు భవిష్యత్తులో వాళ్లకే కాదు, మిమ్మల్నీ ఆదుకుంటుంది. అదే దృష్టితో కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. పేరు NPS వత్సల్య యోజన. ఈ పథకం జూలై 2024లో ప్రారంభమైంది. చిన్న పిల్లల కోసం దీన్ని రూపొందించారు. దీని ద్వారా పిల్లల భవిష్యత్తు కోసం భారీగా నిధి కూడబెట్టుకోవచ్చు.
NPS వత్సల్య ఒక రిటైర్మెంట్ ఫండ్ పథకం. కానీ ఇది మైనర్ పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు లేదా వారసులు తమ పిల్లల పేరుతో PRAN (Permanent Retirement Account Number) తీసుకోవచ్చు. దీనిలో వారు ప్రతి నెల లేదా సంవత్సరానికి కొంత మొత్తంలో డబ్బును జమ చేస్తారు. ఆ డబ్బు ప్రభుత్వ బాండ్లు, ఈక్విటీ వంటి వేర్వేరు అసెట్ క్లాసులలో పెట్టుబడి అవుతుంది. దీని వల్ల దీర్ఘకాలికంగా కంపౌండింగ్ ద్వారా మంచి వృద్ధి జరుగుతుంది.
ఈ పథకంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే – చిన్నప్పటి నుంచే పిల్లల్లో పొదుపు అలవాటు పెంచటం. దీని ద్వారా వారికోసం భద్రమైన భవిష్యత్తును సిద్ధం చేయడం. చదువు, హఠాత్ పరిస్థితులు లేదా రిటైర్మెంట్ వరకూ వారికి ఆర్థిక భద్రత ఉండేలా చేస్తుంది.
[news_related_post]ఈ పథకంలో మీరు సంవత్సరానికి కనీసం రూ.1,000 మాత్రమే జమ చేస్తే సరిపోతుంది. ఇది అన్ని ఆర్థిక స్థితిగల కుటుంబాలకు అందుబాటులో ఉంటుంది. మీరు ఎక్కువ జమ చేయాలనుకుంటే ఎలాంటి పరిమితి లేదు. కావాలంటే మీరు నెలకు ₹10,000 లేదా ₹15,000 కూడా జమ చేయవచ్చు. ఇది ఫ్లెక్సిబుల్ ప్లాన్, అంటే మీకు వీలైనంత డబ్బును జమ చేయవచ్చు.
పిల్లల చదువు కోసం లేదా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మీరు పెట్టుబడి చేసిన మొత్తంలో 25 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది చాలా గొప్ప సౌకర్యం. అలాగే పథకం ద్వారా మంచి వడ్డీ కూడా లభిస్తుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో సగటు వార్షిక వడ్డీ రేటు 9.15% నుంచి 10% వరకు వస్తోంది. దీర్ఘకాలంలో ఇది పెద్ద నిధిగా మారుతుంది.
ఈ పథకంలో మీరు వేసే డబ్బుకు పన్ను మినహాయింపు (Tax Exemption) లభిస్తుంది. సెక్షన్ 80CCD(1B) కింద రూ.50,000 వరకు అదనంగా మినహాయింపు పొందవచ్చు. అంటే మీ పొదుపు పన్ను ప్రయోజనం కూడా ఇస్తుంది.
ఒక ఉదాహరణగా తీసుకుంటే, మీరు ఒక 3 ఏళ్ల బిడ్డ కోసం నెలకు రూ.15,000 జమ చేస్తూ 15 సంవత్సరాలు పెట్టుబడి చేస్తే, అతనికి 18 సంవత్సరాల వయసులో ఇది రూ.60,24,318 కి చేరుతుంది. ఇది సగటు 10% వడ్డీ రేటుని ఆధారంగా తీసుకొని లెక్కించబడింది. అంటే చిన్న డబ్బు కూడా, క్రమశిక్షణతో, సరిగ్గా పెట్టుబడి చేస్తే, కోట్లకు దగ్గరగా వెళ్లొచ్చు.
ఈ పథకం వల్ల పిల్లలకు పెళ్లి, చదువు, జీవన భద్రత వంటి ముఖ్యమైన అవసరాలు తల్లిదండ్రులకు భారంగా అనిపించవు. మినిమం పెట్టుబడి ₹1000 మాత్రమే కావడంతో ప్రతి కుటుంబం పిల్లల పేరుతో ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ఇక ఒకవేళ తల్లిదండ్రులు హఠాత్ మరణించినా, ఈ పథకంలో ఉన్న డబ్బు పిల్లల భవిష్యత్తును కాపాడుతుంది.
ఇది ఒక స్మార్ట్ పొదుపు పథకం. చిన్న వయసులోనే పిల్లల పేరు మీద పెట్టుబడి చేసి, వారు పెద్దవారయ్యేసరికి లక్షల రూపాయల నిధి వారికోసం సిద్ధంగా ఉంచవచ్చు. ఈ స్కీమ్‌ను మీరు కూడా తప్పకుండా పరిశీలించండి. మిస్ అయితే మళ్లీ నష్టమే…