
ఈ రోజుల్లో పెట్టుబడికి భద్రత కావాలంటే చాలా మంది స్టాక్ మార్కెట్ నుంచి దూరంగా ఉంటున్నారు. మరోవైపు బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గుతూ ఉండటంతో నష్టాలు చవిచూస్తున్నారు. అలాంటి సమయంలో గవర్నమెంట్ రన్ చేసే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ఈ స్కీమ్స్‌లో పెట్టుబడి పెడితే నెలనెలకూ ఆదాయం వస్తుంది. ముఖ్యంగా, ఒకసారి డబ్బు పెట్టి మళ్లీ ఆ డబ్బే వడ్డీతో సహా మీ చేతిలోకి వస్తుంది. అలా ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు మీ అమ్మాయిల భవిష్యత్తు కోసం ఒక సురక్షితమైన, అధిక వడ్డీ రేటుతో కూడిన స్కీమ్‌ను వెతుకుతున్నారా? అయితే సుకన్య సమృద్ధి యోజన (SSY) మీ కోసమే. ఇది ప్రత్యేకంగా బాలికల కోసం రూపొందించబడిన స్కీమ్. ఇందులో ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. మీరు నెలకు కనీసం రూ.250 నుంచి ప్రారంభించి ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షలు వరకు పెట్టుబడి పెట్టొచ్చు.
ఈ స్కీమ్ గరిష్ట కాలపరిమితి 21 సంవత్సరాలు. ఈ డబ్బు ఆమె 18 ఏళ్లు నిండిన తర్వాత విద్య, పెళ్లికి ఉపయోగించుకోవచ్చు. అలాగే, సెక్షన్ 80C ప్రకారం పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం పెద్ద మొత్తాన్ని సురక్షితంగా కూడబెట్టుకోవాలంటే ఇది బెస్ట్.
[news_related_post]మీకు నెలకు ఒక స్థిరమైన ఆదాయం రావాలంటే POMIS మీకు బాగా సరిపోతుంది. ఒకసారి పెట్టుబడి పెట్టి, ప్రతి నెల మీరు వడ్డీ రూపంలో డబ్బు పొందుతారు. ఈ స్కీమ్‌లో వడ్డీ రేటు 7.4 శాతం ఉండటంతో మీ డబ్బు పద్ధతిగా పెరుగుతుంది.
ఇందులో వ్యక్తిగతంగా రూ.9 లక్షల వరకు, సంయుక్త ఖాతాల్లో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఉదాహరణకు మీరు రూ.9 లక్షలు పెట్టితే, నెలకు సుమారు రూ.5,550 వరకు వడ్డీ వస్తుంది. ఇది రిటైర్డ్ ఉద్యోగులు, రెంటల్ ఆదాయం లేని వారు, లేదా రెగ్యులర్ ఇన్కమ్ కోసం చూస్తున్నవారికి చక్కటి స్కీమ్.
60 ఏళ్లు పైబడిన వారు తమ పొదుపు డబ్బును భద్రతగా పెట్టుకోవాలంటే SCSS ఉత్తమ ఎంపిక. ఇందులో వడ్డీ రేటు 8.2 శాతం ఉంది. గరిష్ట పెట్టుబడి రూ.30 లక్షలు. ఇది 5 ఏళ్ల స్కీమ్ అయినా, మరో 3 సంవత్సరాలకు పొడిగించవచ్చు. వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లించబడుతుంది.
ఇందులో కూడా సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. రిటైర్మెంట్ తర్వాత నిత్య ఖర్చులకు స్థిర ఆదాయం కావాలనుకునే వారికి ఇది గొప్ప స్కీమ్.
పన్ను మినహాయింపు కావాలసినవారు NSC వైపు చూడొచ్చు. ఇది 5 సంవత్సరాల పెట్టుబడి స్కీమ్. ఇందులో ప్రస్తుతం 7.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్‌లో మీరు కనీసం రూ.100 నుంచి ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు.
ఇందులో పెట్టిన డబ్బుకు పన్ను మినహాయింపు ఉంటుంది. వడ్డీపై కూడా మినహాయింపు లభిస్తుంది, కానీ చివరికి అది ట్యాక్సబుల్ అవుతుంది. అయితే దీని ప్రయోజనం ఏమిటంటే.. ఇది పూర్తిగా గవర్నమెంట్ గ్యారంటీ ఉన్న పెట్టుబడి, అంటే భద్రతతో పాటు సంతృప్తి లభిస్తుంది.
మీరు ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పొదుపు చేయాలనుకుంటే.. పోస్టాఫీస్ స్కీమ్‌లు మీకు సరైన దారి చూపగలవు. చిన్నారుల భవిష్యత్తు కోసం SSY, నెలకో స్థిర ఆదాయం కోసం POMIS, రిటైరైన తర్వాత ఆదాయం కోసం SCSS, పన్ను మినహాయింపు కోసం NSC – ఇలా ఒక్కో స్కీమ్ ఒక్కో అవసరాన్ని తీరుస్తుంది. ఇవన్నీ గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్‌లు కావడంతో, మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. అలాగే మీకు అవసరమైన సౌలభ్యం ప్రకారం ఎంచుకోవచ్చు.
చివరగా – మీరు రిస్క్ లేకుండా మీ డబ్బును పెంచుకోవాలనుకుంటే.. పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లు నిన్ను వదలవు. స్థిర ఆదాయం, పన్ను మినహాయింపు, భద్రత అన్నీ ఒక్కచోటే లభించే చోటు ఇదే…