IndiGo – Electric Air Taxi : ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీ వచ్చేస్తోంది.. నలుగురు ప్రయాణించవచ్చు..!

భారతదేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సర్వీస్: టెక్నాలజీ రోజురోజుకు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో 2026 నాటికి ఎలక్ట్రిక్ ఎయిర్‌టాక్సీని అందుబాటులోకి తెచ్చే దిశగా ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ అడుగులు వేస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

భారతదేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సర్వీస్: ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ వస్తోంది. 2026 నాటికి దేశవ్యాప్తంగా పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సేవలు అందుబాటులోకి వస్తాయని ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది. ఇంటర్‌గ్లోబ్-ఆర్చర్ ఎయిర్‌టాక్సీ, ఆర్చర్ ఏవియేషన్‌తో కలిసి తొలుత ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ నుండి హర్యానాలోని గురుగ్రామ్ వరకు సేవలందిస్తుందని ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ ప్రకటించింది. ఈ రెండు ప్రాంతాల మధ్య రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి 60-90 నిమిషాల సమయం పడుతుండగా, ఎయిర్ టాక్సీలో 7 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. ఒక్కోదానిలో నలుగురు ప్రయాణించవచ్చు. పట్టణ ప్రాంతాల్లో ఎయిర్ ట్యాక్సీ సేవలతో పాటు కార్గో, లాజిస్టిక్స్, మెడికల్, ఎమర్జెన్సీ సేవలకు వీటిని వినియోగించనున్నట్లు ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్ వెల్లడించింది. చార్టర్ సేవలకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ తన భారతీయ కార్యకలాపాల కోసం 200 ఆర్చర్ ఎయిర్‌టాక్సీలను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

భారతదేశంలో పూర్తిగా ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించి, నిర్వహించేందుకు రెండు కంపెనీలు అవగాహన ఒప్పందం (MOU)పై సంతకాలు చేశాయి. ఇంటర్‌గ్లోబ్ గ్రూప్ ఎండీ రాహుల్ భాటియా, ఆర్చర్ సీసీఓ నిఖిల్ గోయెల్ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ సేవలు సంబంధిత నియంత్రణ ఆమోదాలకు లోబడి ఉంటాయి. భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ, ఇండిగో, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్‌లో భాగం. అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ రంగంలో అగ్రగామి సంస్థ.