IMD వర్షాల హెచ్చరిక: APకి ఆనుకుని ఉన్న Odisha and Chhattisgarh ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రానున్న 4-5 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరి మూడు రోజులు ఏపీలో వాతావరణం ఎలా ఉంటుందో చూడాలి
రానున్న మూడు రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
Related News
రాష్ట్రంలోని అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. . June 25, మంగళవారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. కాగా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి.
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కాకినాడ, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో జూన్ 26 బుధవారం భారీ వర్షాలు.. సత్యసాయి, కడప, నెల్లూరు, నంద్యాల , తిరుపతి, చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. June 27వ తేదీ గురువారం కాకినాడ, ప్రకాశం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుంది.
వర్షంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఆరుబయట, పొలాల్లో పనిచేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. చెట్లు, టవర్ల కింద ఉండకూడదని సూచించారు.