చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. కొందరు ప్రభుత్వ రంగంలోని ఇతర విభాగాలకు సంబంధించిన ఉద్యోగాలకు సిద్ధమవుతుండగా, మరికొందరు ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తారు.
ఈ సమయంలో బ్యాంకులు తరచుగా ఉద్యోగ నోటిఫికేషన్‌లను విడుదల చేస్తాయి. ఈ క్రమంలో కొత్తగా నిరుద్యోగులకు, బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఓ శుభవార్త. దాదాపు పది వేల పోస్టులతో భారీ నోటిఫికేషన్ వచ్చింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…
దేశంలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ibps) నోటిఫికేషన్ విడుదల చేసింది.
Related News
IBPS ఎంపిక ద్వారా, దేశంలోని 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్, ఆఫీస్ అసిస్టెంట్, PO, మేనేజర్ వంటి పోస్టులను భర్తీ చేస్తారు.
దాదాపు 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీలు వేర్వేరుగా ఉంటాయి. వాటి నోటిఫికేషన్లు కూడా విడివిడిగా విడుదల చేస్తారు. దరఖాస్తు చేసుకునే ముందు ఒకసారి నోటిఫికేషన్‌ను పరిశీలించడం మంచిది.
IBPS.. CPR RRB 2024 నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా 9995 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అంటే క్లర్క్, ఆఫీస్ స్కేల్ పోస్టులకు ఎంపిక ఉంటుంది. గ్రూప్-ఎ ఆఫీసర్స్ (స్కేల్-1,2,3), గ్రూప్-బి ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
ELIGIBILITY: ఏదైనా డిగ్రీ హోల్డర్లు అర్హులు.
IBPS Exam schedule:
ప్రిలిమ్స్ ఆగస్టులో, మెయిన్స్ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో నిర్వహిస్తారు.
Vacancy position:
ఏపీలో 450,
తెలంగాణలో 700 పోస్టులు ఉన్నాయి.
APPLICATION FEE/ INTIMATION CHARGES:
Application Fees/ Intimation Charges (Online payment from 07.06.2024 to 27.06.2024 both dates inclusive)
- Officer (Scale I, II & III): Rs.175/- (Inclusive of GST) for SC/ST/PwBD candidates. Rs.850/- (Inclusive of GST) for all others
- Office Assistants (Multipurpose): Rs.175/- (Inclusive of GST) for SC/ST/PwBD/ ESM /DESM candidates. Rs.850/- (Inclusive of GST) for all others
ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను అధికారిక వెబ్‌సైట్ ibps.in వెబ్‌సైట్ ద్వారా తనిఖీ చేయవచ్చు.
ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు వయోపరిమితి 18 నుంచి 28 ఏళ్లు.
గ్రూప్ ఎ ఆఫీసర్, గ్రూప్-బి కేటగిరీ పోస్టులకు వయోపరిమితి భిన్నంగా ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ ఉన్న యువత ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
Last Date to apply: 27-06-2024
IBPS Notification pdf click here