ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డేస్ సేల్‌కు ముందే ఈ ఐఫోన్ల పై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్!

ఫ్లిప్‌కార్ట్ జనవరి 14 నుండి రిపబ్లిక్ డేస్ 2025 సేల్ ని తీసుకువస్తోంది. అయితే, ప్లస్ సభ్యులు జనవరి 13 నుండి ఈ సేల్‌ను ఆస్వాదించగలరు. ఈ సేల్ కు ముందే ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో ఐఫోన్ 16, 16 ప్లస్ లపై అదిరే గొప్ప తగ్గింపులను అందిస్తోంది. ఒకవేళ మీరు కూడా చాలా కాలంగా లేటెస్ట్ ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ రెండు డీల్స్ మీ కోసమే! ఈ క్రమంలో ఐఫోన్ 16, 16 ప్లస్‌లను చౌకగా ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఆపిల్ ఐఫోన్ 16 (వైట్ 128GB)

ఐఫోన్ 16 గురించి మాట్లాడుకుంటే.. ఈ ఫోన్ ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా కేవలం రూ.74,900కే ఇ-కామర్స్ సైట్‌లో లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ.79,900కి మార్జిట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అంటే.. ప్రస్తుతం ఈ ఫోన్ పై కంపెనీ రూ.5,000 డైరెక్ట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఇది మాత్రమే కాదు.. బ్యాంక్ ఆఫర్లతో ఫోన్ ధర మరింత తగ్గుతుంది. SBI క్రెడిట్ కార్డ్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ICICI బ్యాంక్ క్రెడిట్ ద్వారా చెల్లింపుపై కంపెనీ అదనంగా రూ. 4,000 తగ్గింపును అందిస్తోంది. తద్వారా మీరు పరికరంపై రూ. 9,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు.. కంపెనీ రూ. 5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తోంది.

Related News

 

ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ (వైట్128GB)

ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఐఫోన్ 16 ప్లస్‌పై డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. మీరు ఇప్పుడే ఈ పరికరాన్ని కేవలం రూ. 84,900 కి కొనుగోలు చేయవచ్చు. కాగా, ఈ ఫోన్‌ను కంపెనీ గత సంవత్సరం రూ.89,900కి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ పై SBI క్రెడిట్ కార్డ్ కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ICICI బ్యాంక్ క్రెడిట్ ద్వారా రూ.4,000 తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ ఫోన్ పై అద్భుతమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. UPI లావాదేవీ ద్వారా మీరు ఫోన్‌లో రూ. 2,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు

ఐఫోన్ 16 ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంద. మరోవైపు.. ఐఫోన్ 16 ప్లస్ 6.7 అంగుళాల స్క్రీన్ సైజును కలిగి ఉంది. దీని గరిష్ట ప్రకాశం 2,000 నిట్‌లు, డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఇది 3nm ఆక్టా-కోర్ A18 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. దీనిలో 6-కోర్ CPU, 5-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఉన్నాయి. ఈ పరికరం డ్యూయల్ సిమ్‌కు మద్దతు కూడా ఇస్తుంది. iOS 18లో నడుస్తుంది. ఇది ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

ఇక కెమెరా గురుంచి మాట్లాడితే.. ఐఫోన్ 16 డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 2x ఇన్-సెన్సార్ జూమ్, f/1.6 ఎపర్చర్‌తో 48-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, f/2.2 ఎపర్చరు, ఆటోఫోకస్‌తో కూడిన 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కనెక్టివిటీ కోసం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్, GPS, NFC, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.