స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ఫీచర్లు బాగుండాలి, లుక్ స్టైలిష్‌గా ఉండాలి, పర్ఫామెన్స్ మెరుగు ఉండాలి. ఇవన్నీ కలిపిన మొబైల్ ఎక్కడ దొరుకుతుంది అని చాలా మంది అనుకుంటుంటారు. అలాంటి వారికి Honor X9c ఓ మంచి ఆప్షన్ అవుతుంది. ఇది మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ అయినా ఫీచర్లలో ఏ మాత్రం తగ్గదు. దీని డిజైన్, స్క్రీన్, కెమెరా, బ్యాటరీ లైఫ్ అన్నింటినీ వివరంగా తెలుసుకుందాం.
డిజైన్ చూస్తే డైరెక్ట్ క్లాస్ ఫీల్
Honor X9c ఫోన్ చాలా స్లిమ్‌గా ఉంటుంది. దాని మందం కేవలం 8mm మాత్రమే. చేతిలో పట్టుకునేందుకు చాలా ఈజీగా ఉంటుంది. బరువు కూడా కేవలం 189 గ్రాములే. చాలా లైట్‌గా అనిపిస్తుంది. దీన్ని ఎంతసేపైనా హోల్డ్ చేయొచ్చు. వాడటానికి అసలు ఇబ్బంది అనిపించదు.
డిస్ప్లే విషయానికి వస్తే, ఇది ఫోన్‌కు హైలైట్. ఫోన్లో 6.78 అంగుళాల AMOLED స్క్రీన్ ఉంటుంది. దీని రిజల్యూషన్ 1224 x 2700 పిక్సెల్స్. అందులోనూ 437ppi పిక్సెల్ డెన్సిటీ ఉంటుంది. అంటే పిక్చర్ క్లారిటీ సూపర్‌గా ఉంటుంది. ఎలాంటి కంటెంట్ అయినా క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తుంది. స్క్రీన్ బ్రైట్నెస్ గరిష్ఠంగా 4000 నిట్స్ వరకూ ఉంటుంది. అంటే వెలుతురు ఉన్న ప్రదేశంలో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. పంచ్-హోల్ డిజైన్ వలన వీడియోలు, గేమింగ్ చాలా ఇమర్సివ్‌గా అనిపిస్తాయి.
108MP కెమెరా – నెక్స్ట్ లెవెల్ ఫొటోలు
Honor X9c ఫోన్లో ఉన్న 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మెయిన్ హైలైట్. దీనితో దిగిన ఫొటోలు డీటెయిల్స్ బాగా చూపిస్తాయి. తక్కువ లైట్లో కూడా పర్ఫార్మెన్స్ ఓకేగానే ఉంటుంది. కానీ, ఫ్లాగ్షిప్ ఫోన్లతో పోలిస్తే కాస్త క్లారిటీ తక్కువగానే ఉంటుంది. మరో 5MP సపోర్ట్ కెమెరా కూడా ఉంటుంది. కానీ ఇది అంతగా ఇంట్రెస్టింగ్ అనిపించదు.
సెల్ఫీ కెమెరా విషయంలో, ఇందులో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకునే ఫొటోల కోసం ఇది సరిపోతుంది. కానీ హై-ఎండ్ సెల్ఫీలు తీసుకోవాలనుకునే వారికి ఇది తక్కువగానే అనిపించొచ్చు. వీడియో రికార్డింగ్ విషయంలో ఇది 4K 30fps తో రికార్డు చేయగలదు. ఈ ధరలో ఈ ఫీచర్ రావడం చాలా గొప్ప విషయం.
పర్ఫామెన్స్ – ఓకే కానీ లిమిటెడ్
Honor X9c లో Snapdragon 6 Gen 1 ప్రాసెసర్ ఉంది. ఇది Octa-core ప్రాసెసర్. క్లాక్ స్పీడ్ 2.2GHz వరకు ఉంటుంది. సాధారణ యాప్‌లు, గేమ్స్ రన్ చేయడానికి ఇది బాగానే ఉంటుంది. కానీ హై ఎండ్ మల్టీటాస్కింగ్ లేదా భారీ యాప్స్ కోసం చూస్తే ఇది కాస్త తగ్గిన లెవెల్లో ఉంటుంది.
ఫోన్లో 8GB RAM ఉంటుంది. ఇది మిడ్‌రేంజ్ స్టాండర్డ్. అలాగే 256GB స్టోరేజ్ కూడా లభిస్తుంది. కానీ ఇందులో మెమరీ కార్డ్ సపోర్ట్ లేదు. అంటే స్టోరేజ్ ఎక్కువ అవసరమయ్యే యూజర్లకు ఇది చిన్న మైనస్ అయి ఉండొచ్చు.
బ్యాటరీ – ఇదే అసలైన హీరో
Honor X9c లో 6600mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే ఒకటిన్నర రోజు వరకూ చార్జ్ అయిపోకుండా ఉంటుందంటే ఆశ్చర్యమే. ఇదే అసలైన ఫోన్‌కు ప్లస్ పాయింట్. పనిలో బిజీగా ఉండే వాళ్లకు ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది.
మరొక స్పెషల్ విషయం ఏమిటంటే ఇందులో 66W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అంటే ఫోన్‌ను చాలా తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఇందులో USB Type-C v2.0 పోర్ట్, Wi-Fi, Bluetooth v5.1, NFC, ఇంకా IR బ్లాస్టర్ వంటి అన్ని కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇంటి అప్లయన్సెస్‌ను రిమోట్‌లా ఆపరేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.
మొత్తానికి – మంచి డిస్కౌంట్ లో గొప్ప డీల్
Honor X9c ఒక ప్రామిసింగ్ మిడ్‌రేంజ్ ఫోన్. దీని స్క్రీన్ సైజ్, AMOLED డిస్ప్లే, 108MP కెమెరా, 6600mAh బ్యాటరీ, 66W ఫాస్ట్ ఛార్జింగ్ ఇవన్నీ టాప్ లెవెల్ ఫీచర్లు. కానీ ఇందులో ప్రాసెసర్ కాస్త స్లోగా ఉండడం, స్టోరేజ్ ఎక్స్పాండబిలిటీ లేకపోవడం చిన్న మైనస్.
అయినా కూడా, ఒక బడ్జెట్లో ఉండే మల్టీ ఫీచర్ ఫోన్ కావాలంటే Honor X9c చక్కగా ఫిట్ అవుతుంది. దీన్ని మీరు తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది, మీరు లేట్ చేస్తే ఆఫర్స్ మిస్ అవుతారు.
6600mAh బ్యాటరీతో సూపర్ డీల్ కావాలంటే, ఇది ఇప్పుడు మిస్ అయితే, తర్వాత మళ్లీ దొరకదు…