HMPV Virus: హెచ్ఎంపీవీ వైరస్.. మాస్క్ తప్పనిసరి

హెచ్‌ఎంపీవీ వైరస్ చాపకింద నీరులా దేశంలో నెమ్మదిగా విస్తరిస్తోంది. ఒక్కరోజులో నాలుగు కేసులు నమోదు కావడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కర్ణాటకలో రెండు కేసులు.. గుజరాత్, కోల్‌కతాలో ఒక్కో కేసు నమోదైనట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. బెంగళూరులో 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకగా.. అదే వైరస్ లక్షణాలతో ఓ చిన్నారి అహ్మదాబాద్‌లో చికిత్స పొందుతోంది. హెచ్‌ఎంపీవీ వైరస్‌ లక్షణాలు ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపిస్తాయి.

వ్యాధి లక్షణాలు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది. ఇదిలా ఉండగా.. వైరస్‌ కేసులు నమోదు కావడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. వైరస్ లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. వాటిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

Related News