UPI చెల్లింపులపై షాకింగ్ ఊరట… ₹2,000లోపు UPI లావాదేవీలకు సర్కారు ₹1,500 కోట్ల బహుమతి….

నిత్యం UPI పేమెంట్స్ చేసే ప్రతి ఒక్కరికీ మోదీ సర్కారు ఓ సూపర్ గుడ్ న్యూస్ ఇచ్చింది. చిన్న వ్యాపారస్తులకు పెనుఉరట కలిగించేలా ₹2,000 లోపు BHIM-UPI లావాదేవీలపై భారీ సబ్సిడీ ప్రకటించింది. కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయంతో, చిన్న పేమెంట్స్ పై సర్కారు ₹1,500 కోట్ల ప్రోత్సాహక పథకం తీసుకురాబోతోంది

ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది? మీరు రోజూ చేసే ₹2,000 లోపు UPI పేమెంట్స్ పై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) ఛార్జీలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. దీని వల్ల చిన్న వ్యాపారులు ఇక MDR భారం లేకుండా డిజిటల్ లావాదేవీలు స్వీకరించగలరు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ పథకానికి కారణం ఏమిటి?

  •  డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం – చిన్న మొత్తాల చెల్లింపులను మరింత సులభం చేయడం.
  •  చిన్న వ్యాపారులకు భారం తగ్గించడం – షాప్ ఓనర్స్ MDR ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేకుండా చేయడం.
  •  UPI లావాదేవీలను మరింత వేగంగా విస్తరించడం – ₹2,000 లోపు పేమెంట్స్ ఎక్కువగా జరిగేలా ప్రోత్సహించడం.

సర్కారు ఏం చెప్పింది?

  •  ₹2,000 లోపు BHIM-UPI లావాదేవీలను ప్రోత్సహించేందుకు “Person to Merchant (P2M) Incentive Scheme” ఆమోదం పొందింది.
  •  2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ₹1,500 కోట్లను కేటాయించింది.
  •  చిన్న వ్యాపారుల కోసం ప్రతి లావాదేవీపై 0.15% మేర సబ్సిడీ ఇవ్వనుంది.

MDR అంటే ఏమిటి?

  • MDR (Merchant Discount Rate) అంటే మర్చంట్స్ UPI ద్వారా వచ్చిన చెల్లింపుల కోసం బ్యాంకులకు చెల్లించే ఫీజు.
  • 2020 కరోనా తర్వాత, ₹2,000 లోపు UPI పేమెంట్స్ పై MDRను రద్దు చేశారు.
  • ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చిన్న వ్యాపారులపై ఈ భారం లేకుండా చేయడానికి ₹1,500 కోట్ల స్కీమ్ తీసుకురావడం జరిగింది.

ఈ పథకం వల్ల ఎవరికి లాభం?

  1.  చిన్న వ్యాపారస్తులు – షాప్స్, కిరాణా దుకాణాలు, స్ట్రీట్ వెండర్స్, మైక్రో బిజినెస్ ఓనర్స్.
  2.  UPI వినియోగదారులు – చిన్న చెల్లింపులు చేసే ప్రతి ఒక్కరికీ వేగవంతమైన లావాదేవీలు.
  3.  దేశ ఆర్థిక వ్యవస్థ – డిజిటల్ పేమెంట్స్ మరింత విస్తరించడానికి ఇది గొప్ప అవకాశం.

ఇక భయం లేకుండా చిన్న మొత్తాల UPI పేమెంట్స్

చిన్న వ్యాపారులు MDR భారం లేకుండా తమ వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ స్కీమ్ UPI వినియోగాన్ని పెంచే అద్భుత అవకాశంగా మారబోతోంది. UPI ట్రాన్సాక్షన్లు పెరుగుతే డిజిటల్ ఇండియా కాస్తా మరింత వేగంగా ఎదుగుతుంది.

మీరు కూడా UPI ద్వారా పేమెంట్స్ చేస్తుంటే, ఈ సరికొత్త మార్పును పూర్తిగా సద్వినియోగం చేసుకోండి.

Related News