GOOD NEWS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అగ్నివీర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు..!!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. అగ్నిపథ్ పథకం కింద 2025-26 సంవత్సరానికి అగ్నివీర్ పోస్టుల ఎంపిక పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ ప్రకటించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ మేరకు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఈ బుధవారం ప్రారంభమై ఏప్రిల్ 10, 2025న ముగుస్తుందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుండి దరఖాస్తులు స్వీకరించబడతాయి.

జూన్ నెలలో అభ్యర్థుల ఆన్‌లైన్ పరీక్ష తేదీని నిర్వహించడానికి ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు. అగ్నివీర్ (జనరల్ డ్యూటీ), అగ్నివీర్ (టెక్నికల్), అగ్నివీర్ (క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్), అగ్నివీర్ ట్రేడ్స్‌మన్ (10వ తరగతి పాస్), అగ్నివీర్ ట్రేడ్స్‌మన్ (8వ తరగతి పాస్) కేటగిరీలకు అభ్యర్థుల ఎంపిక నిర్వహించబడుతుంది. అయితే, అభ్యర్థులు వారి అర్హత ఆధారంగా ఏవైనా రెండు కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది. మరిన్ని వివరాలకు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. మరిన్ని సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్‌ను 040-27740059 అనే ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చు.

Related News